అరే అప్పుడే అమెజాన్ లో ప్రత్యక్షమైందే

Mon Sep 16 2019 23:12:39 GMT+0530 (IST)

Evaru Movie in Amazon Prime

డిజిటల్ మీడియా దూకుడు ముందు ఏదీ నిలబడడం లేదు. డిజిటల్ రిలీజ్ కి 60 రోజుల మినిమం సమయం అవసరం అని పంపిణీదారులంతా గగ్గోలు పెడుతుంటే అలాంటి రూల్స్ తమకు వర్తించవు అన్న చందంగానే ఉంది డిజిటల్ కంపెనీల వ్యవహారం. కొన్నిసార్లు ఇంకా సినిమా థియేటర్లలో ఆడుతుండగానే అమెజాన్ ప్రైమ్ .. నెట్ ఫ్లిక్స్ లాంటి చోట్ల ఆ సినిమా చూసుకునే వీలు కలుగుతోంది.అలాంటి సందర్భమే ఇది. అడివి శేష్ నటించిన హిట్టు చిత్రం `ఎవరు` ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే అప్పుడే అమెజాన్ ప్రైమ్ లో లైవ్ అయిపోయింది. ఆగస్టు 16న ఈ సినిమా రిలీజైంది. అంటే నేటితో నెలరోజులు అయ్యింది. సరిగ్గా 30 రోజులకే ఆన్ లైన్ లో రిలీజైపోయింది. అప్పుడే సకుటుంబ సమేతంగా చాలా మంది `ఎవరు` చిత్రాన్ని 55 ఇంచీ స్మార్ట్ టీవీల్లో చూసేశామని ఫోన్లు చేసి మరీ ముచ్చటించుకుంటున్నారు.

అంటే ఇంటింటికీ టీవీ ఉన్నట్టే ఇంటింటికీ అమెజాన్ అంత ఫ్యామిలీ ఎఫెక్షన్ తో కనెక్ట్ అయిపోతోందని అర్థమవుతోంది. మునుముందు భవిష్యత్ డిజిటల్ దే అనేందుకు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. కొందరైతే కేవలం 3డి సినిమాల్ని మాత్రమే పెద్ద తెరపై చూసుకుని మిగతావి అమెజాన్ లో చూసుకునే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు. బాబోయ్ .. ఇది తలుచుకుంటేనే గుండె గుభేల్మనకుండా ఉంటుందా సినిమాలు తీసేవాళ్లకు. వాటిని కొనుక్కునే బయ్యరుకు. మునుముందు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై వెబ్ సిరీస్ లనే సినిమాలుగా భావించే సన్నివేశం ఉందని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఈ స్పీడ్ ని క్యాచ్ చేసి ముందుకు వెళ్లే వాళ్లదే రాజ్యంగా ఉంటుందనడంలో సందేహమే లేదు.