ఎవరు రీమేకా ఫ్రీమేకా ?

Sat Jul 20 2019 11:52:07 GMT+0530 (IST)

నిన్న విడుదలైన అడవి శేష్ ఎవరు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఎవరు గురించి గతంలో హాలీవుడ్ మూవీ ది ఇన్విజిబుల్ గెస్ట్ ఆధారంగా రూపొందినట్టు వార్తలు వచ్చాయి కానీ వాటికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అది గాసిప్ గానే మిగిలిపోయింది. కానీ టీజర్ చూశాక చాలా క్లారిటీ వచ్చింది. హత్య కేసులో ఇరుక్కున్న అమ్మాయి నిజాలు నిర్ధారించడానికి వచ్చిన ఒక హీరో వీళ్ళ మధ్య అర్థం కాని పజిల్ గా చనిపోయిన యువకుడి తల్లితండ్రులు ఇదీ స్థూలంగా రెండు సినిమాల్లో కనిపించిన కామన్ పాయింట్.ఇదే ప్లాట్ తో ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్-తాప్సిల కాంబినేషన్ లో షారుఖ్ ఖాన్ నిర్మాతగా బద్లా వచ్చింది. 80 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఎవరులో ఈ రెండు సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత క్లియర్ గా ఉన్నారు అంటే బహుశా రీమేక్ హక్కులు కొనే చేసి ఉంటారు. ఫ్రీ మేక్ అయ్యే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. నిర్మాణ సంస్థ పివిపి కాబట్టి ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారనే కామెంట్ కూడా వినిపిస్తోంది.

ఏదైతేనేం బదలాలో లాయర్ గా ఉన్న హీరో పాత్ర ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మారింది. అదొక్కటే కీలక మార్పుగా కనిపిస్తోంది. ఆగస్ట్ 15న విడుదల కాబోతున్న ఎవరు మీద అడవి శేష్ చాలా హోప్స్ తో ఉన్నాడు. క్షణం - గూఢచారి తర్వాత చేస్తున్న ఫుల్ లెన్త్ రోల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.