డైరెక్టర్ ను తిట్టి మరీ క్షమాపణలు చెప్పించుకుందట

Thu Oct 28 2021 11:03:41 GMT+0530 (IST)

Esha Gupta said many things in a recent interview

బాలీవుడ్ లోనే కాకుండా ఏ ఇండస్ట్రీలో అయినా కూడా హీరోయిన్స్ దర్శకుల మాట వినాల్సిందే. కొన్ని సార్లు దర్శకులు తిట్టినా కూడా ఓర్చుకుని ముందుకు సాగాలి. దర్శకులకు నచ్చకుంటే సినిమా నుండి తొలగించే సందర్బాలు ఉంటాయి. అందుకే దర్శకులకు అనుగుణంగా నడుచుకోవాలంటూ ఉంటారు. దర్శకులు సీనియర్ లు అయితే వారికి కనీసం ఎదురు కూడా చెప్పకూడదు. కాని కొత్త దర్శకులు అయితే మాత్రం నటీ నటులు వారికి ఎదురు తిరుగుతూ ఉంటారు. కొన్ని సార్లు కొత్త దర్శకుడు పట్టుదలతో ఉంటే నిర్మాతలు ఇబ్బంది పడుతూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా ఒక సినిమా షూటింగ్ సందర్బంగా దర్శకుడితో గొడవ పడిందట. అతడు తిడితే తిరిగి అతడిని తిట్టి షూటింగ్ నుండి తప్పుకుంటున్నట్లుగా వెళ్లి పోయిందట. షూటింగ్ ను కంటిన్యూ చేయడం కోసం నిర్మాతలు చాలా కష్టపడాల్సి వచ్చిందట.తాజా ఇంటర్వ్యూలో ఇషా గుప్తా మాట్లాడుతూ.. గతంలో తాను ఒక సినిమా లో నటిస్తున్న సమయంలో దర్శకుడు తాను ఏ డ్రస్ లో రావాలో ముందుగా చెప్పలేదు. ఆ విషయంలో మా ఇద్దరి మద్య కమ్యూనికేషన్ జరగలేదు. దాంతో షూటింగ్ కు హాజరు అవ్వడం లో లేట్ అయ్యింది. లొకేషన్ కు ముందుగానే వెళ్లినా కూడా షూటింగ్ కు వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ గురించి చెప్పక పోవడంతో ఆలస్యం అయ్యింది. ఆ విషయం దర్శకుడు పట్టించుకోకుండా నీ వల్ల ఇంత ఆలస్యం అంటూ నా పై అరవడం మొదలు పెట్టాడు. దాంతో నేను కూడా అతడి మాటలకు మాట సమాధానం ఇచ్చాను. నా కాస్ట్యూమ్స్ విషయంలో ముందుగా చెప్పకుండా నా పై అరిస్తే ఎలా అన్నాను. అతడి ప్రతి మాటకు సమాధానం చెప్పాను. షూటింగ్ లో పాల్గొనకుండా అక్కడ నుండి వెళ్లి పోయాను.

నిర్మాతలు రెండు మూడు సార్లు షూటింగ్ కు హాజరు అవ్వాలని విజ్ఞప్తి చేసినా కూడా నేను మాత్రం వెళ్లలేదు. చివరకు ఆ దర్శకుడు వచ్చి క్షమాపణలు చెప్పి షూటింగ్ కు హాజరు అవ్వాల్సిందిగా కోరడంతో మళ్లీ షూటింగ్ కు వెళ్లాను అంది. తప్పు లేకుండా అస్సలు మాట పడవద్దని కొత్త హీరోయిన్స్ కు ఆమె సలహా ఇచ్చింది. సీనియర్ దర్శకుల వద్ద ఇలాంటివి కష్టం కాని ప్రతి సారి కూడా రాజీ పడి దర్శకులు నిర్మాతలు ఏమన్నా కూడా తల దించుకుని ఉండవద్దు అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసింది.