ఫోటో స్టోరి: గుప్తాజీ ఇస్టయిల్ అదిరెనులే

Mon Aug 03 2020 11:00:41 GMT+0530 (IST)

Esha Gupta Latest Stunning Pose

బాలీవుడ్ లో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీ ఎవరు? అంటే.. ఇషా గుప్తా పేరే యూత్ తలుస్తుంది. ఈ మాజీ మిస్ హాట్ నెస్ కి కవ్వింతకు కేరాఫ్ అడ్రెస్. ఫెమీనా మిస్ ఇండియా దివా పోటీలకు జడ్జిగా వ్యవహరించే ఇషా గుప్తా స్టైల్ అండ్ ఫ్యాషన్ ఐకన్ గా దశాబ్ధాల పాటు రాజ్యమేలుతూనే ఉంది. నవతరం మోడల్స్ ని తీర్చిదిద్దడంలోనూ తనది అందె వేసిన చేయి. ముంబై ఫ్యాషన్ స్కూల్స్ లో  లెక్చరర్ గా ఇషా ఇప్పటికే ఎందరినో తీర్చిదిద్దింది. అందాల పోటీలకు పంపించింది. ట్యాలెంటుకు ఇషా ఒక స్ఫూర్తి.ఇక ఇషా ఇన్ స్టా ఫోటోలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా తనని అనుసరించే వారి సంఖ్య లక్షల్లో ఉంది. గత కొంతకాలంగా క్వారంటైన్ టైమ్ ని ఇషా ఇదిగో ఇలా లేటెస్ట్ ఫోటోషూట్లతోనే స్పెండ్ చేస్తున్నారు. తాజా ఫోటోలో ఫ్లోరల్ డిజైనర్ టాప్ లో అందాల ఎలివేషన్.. దానికి కాంబినేషన్ పంచె కట్టు తరహా డిజైనర్ ఫ్యాంటు చూస్తుంటేనే వ్వావ్ అనకుండా ఉండలేం. ఇక తన చేతిలో అంత బుద్ధిగా ఒదిగిపోయిన ఆ పెట్ డాగ్ ఎంతో ముద్దొచ్చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనూ ఎక్కడా హాట్ నెస్ ని తగ్గించలేదు ఈ బ్యూటీ.

గుప్తా `జన్నత్ 2` చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇమ్రాన్ హష్మి సరసన నాయికగా నటించింది. ఆ తర్వాత వేడెక్కించే సన్నివేశాల్లో జీవించే నాయికగా ఇషాకు ప్రత్యేక ఐడెంటిటీ దక్కింది. 2013లో టైమ్స్ 50 అత్యంత అందగత్తెల జాబితాలో ఇషా 8వ స్థానంలో నిలిచింది.  కమెండో 2 సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హేరాఫేరి 3లోనూ నాయికగా నటిస్తోంది. అలాగే `దేశీ మ్యాజిక్` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక పలు టీవీ చానెళ్లలో జడ్జిగానూ కొనసాగుతూ బిజీగా ఉంది.