హీరోయిన్ కి అన్యాయం చేసిన భాయ్

Wed Nov 24 2021 11:03:05 GMT+0530 (IST)

Entire heroine part was removed in the editing

ఒక పెద్ద హీరో సరసన అవకాశం వస్తే .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొడితే అటుపై ఆ చిత్రానికి పని చేసిన నటీనటులు టెక్నీషియన్లు అందరికీ అది పరిశ్రమలో మంచి మైలేజ్ ని ఇస్తుంది. ఇక కథానాయికలకు అమాంతం ఇమేజ్ పెరుగుతుంది. స్టార్ డమ్ అందుకునే దిశగా వెళతారు.కానీ అలాంటి ఓ పెద్ద ఆఫర్ వచ్చినట్టే వచ్చి వెళితే కుంగుబాటు కూడా అదే విధంగా ఉంటుంది. ఇక తనపై సన్నివేశాలు తెరకెక్కించి సినిమా రిలీజ్ ముందు ఎడిటింగ్ లో కోసేస్తే అప్పుడు ఆ హీరోయిన్ సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించండి.

పాపం ప్రగ్య.. అలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంచె చిత్రంతో టాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న ప్రగ్య అటుపై కెరీర్ పరంగా నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. అడపాదడపా అవకాశాలు మినహా స్టార్ డమ్ అనేది ఈ ముంబై బ్యూటీకి అందని ద్రాక్షే అయ్యింది.

సరిగ్గా ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాంటిమ్ లో అవకాశం దక్కించుకుంది. కానీ ఏం లాభం? ఈ సినిమాలో నటించినా కానీ ప్రగ్య కు ప్రయోజనం లేకుండా చేసింది టీమ్. ఫుటేజ్ లెంగ్త్ దృష్ట్యా ఎడిటింగ్ లో హీరోయిన్ పార్ట్ మొత్తం తొలగించారు.

సల్మాన్ - ప్రగ్య లవ్ స్టోరీకి ప్రాధాన్యత లేకపోవడంతో సీన్లు తీసేశారు. దీంతో ప్రగ్య తీవ్ర నిరాశకు గురైందట. లైఫ్ లో ఎంతో వేచి చూసిన తరుణం రానే వచ్చింది అనుకుంటుండగానే ఇంతలోనే ఊహించని నిరాశ.

ఇక యాంటిమ్ చిత్రంలో సల్మాన్ బావ ఆయుష్ శర్మ ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ లెంగ్తీ అతిధి పాత్రలో నటించాడు. సల్మాన్ కి రొమాంటిక్ ట్రాక్ ఉంది. ప్రగ్యా జైస్వాల్ తో కొన్ని సన్నివేశాలు ఒక పాట కూడా చిత్రీకరించారు.

అయితే తన ట్రాక్ సినిమా ప్రవాహానికి అడ్డుగా ఉందని భావించిన సల్లూ భాయ్ దానిని తొలగించి ప్రగ్యాకు షాకిచ్చాడు. ప్రగ్య ప్రస్తుతం బాలయ్య సరసన అఖండలో నటించింది. ఈ సినిమా తనకి బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది. తదుపరి పవన్ కల్యాణ్ సరసన ఓ చిత్రంలో అవకాశం అందుకుందని ప్రచారమవుతోంది.

ఒక పెద్ద హీరో సరసన అవకాశం వస్తే .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొడితే అటుపై ఆ చిత్రానికి పని చేసిన నటీనటులు టెక్నీషియన్లు అందరికీ అది పరిశ్రమలో మంచి మైలేజ్ ని ఇస్తుంది. ఇక కథానాయికలకు అమాంతం ఇమేజ్ పెరుగుతుంది. వరుస అవకాశాలతో స్టార్ డమ్ అందుకునే ఛాన్సుంటుంది.

కానీ అలాంటి ఓ పెద్ద ఆఫర్ వచ్చినట్టే వచ్చి చివరిలో నిరాశపరిస్తే కుంగుబాటు కూడా అదే విధంగా ఉంటుంది. ఇక తనపై సన్నివేశాలు తెరకెక్కించి సినిమా రిలీజ్ ముందు ఎడిటింగ్ లో మొత్తం కోసేస్తే అప్పుడు ఆ హీరోయిన్ సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించండి.