పెళ్లైన మహిళతో అక్రమ సబంధం పెట్టుకున్నట్లుగా ఒప్పుకున్న స్టార్ హీరో!

Thu Jul 18 2019 07:00:02 GMT+0530 (IST)

ఒకప్పుడు బాలీవుడ్ లో ముద్దు సీన్ లకు యమ ఫేమస్ ఇమ్రాన్ హష్మీ. ఇతడు చేసిన ముద్దు సీన్స్ సెన్షేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఇమ్రాన్ హష్మీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెళ్లడించాడు. తాను గతంలో ఒక పెళ్లయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సంఘటన తన జీవితంలోనే పెద్ద తప్పుగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.తాను నటించిన 'మర్డర్' చిత్రంలోని సన్నివేశం తన నిజ జీవితంలో కూడా జరగడం అస్సలు ఊహించలేదు. తాను చేసింది ముమ్మాటికి తప్పు అని ఒప్పుకున్నాడు. ఆమెకు పెళ్లి అయినట్లుగా నాకు తెలియదు అని.. పెళ్లి అయిన విషయం ఆమె నా వద్ద దాచి పెట్టింది. ఒకానొక సమయంలో ఆమెతో ఏకంగా ఉన్న సమయంలో ఆమె భర్త చూశాడు. ఆ సమయంలో చాలా పెద్ద గొడవ అయ్యింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడటంతో చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. మద్య వర్తుల ద్వారా గొడవ సర్దుమణిగింది. పెళ్లి అయ్యిందని తెలిసిన తర్వాత దూరంగా ఉండాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉండలేక పోయినట్లుగా చెప్పుకొచ్చాడు.

నేను ఎంతో నీచపు పని చేశానో నాకు తెలుసు. అదే నా భార్యతో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం నేను ఊరుకునే వాడిని కాదు. నా ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే అక్కడిక్కకడే చంపేసేవాడిని. జీవితంలో తాను చేసిన ఆ పని క్షమించరానిదని.. అది తనకు ఒక గుణపాఠం వంటిదని ఈ సందర్బంగా ఇమ్రాన్ హష్మీ చెప్పుకొచ్చాడు. తాను చేసిన తప్పును ఇంత బాహాటంగా ఒప్పుకున్న ఇమ్రాన్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.