చెమటలు కక్కిస్తున్న ఈషా.. అంత కష్టం ఎందుకో..!

Tue Nov 29 2022 15:03:28 GMT+0530 (India Standard Time)

Eesha Rebba WorkingOut in Gym

అవకాశాలు ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ అన్న తర్వాత తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్నాం కదా అని ఏది పడితే అది తిని.. ఎలా పడితే అలా ఉంటే ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు కూడా రావు. అందుకే ఛాన్సులు ఉన్నా లేకపోయినా సరే భామలంతా కూడా తన ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఈషా రెబ్బ కూడా ఉంది. తెలుగు అమ్మాయిగా తన సత్తా చాటుతూ వస్తున్న ఈషా రెబ్బ స్టార్ క్రేజ్ దక్కించుకోలేదు కానీ మంచి ఐడెంటిటీ సంపాదించింది.సినిమాలు వెబ్ సీరీస్ ఇలా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా చేస్తూ వస్తున్న ఈషా రెబ్బ లేటెస్ట్ గా తన జిమ్ వీడియోని ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. చెమటలు కక్కుతూ ఓ రేంజ్ లో కష్టపడుతుంది అమ్మడు.

అసలు ఎందుకు ఈషా ఈ రేంజ్ లో వర్క్ అవుట్స్ చేస్తుంది అంటే.. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ కోసమే అంటున్నారు. ప్రస్తుతం అవకాశాలు లేవని లేజీగా మారితే ఏదైనా ఛాన్స్ వచ్చాక ఫిజిక్ మార్చాలన్నా చాలా కష్టం. అందుకే ఈషా రెబ్బ వర్క్ అవుట్స్ చేస్తూ కష్టపడుతుంది.  

సండే ఎవరైనా ఎంచక్కా జాలీ ట్రిప్ కి వెళ్తారు. కానీ ఈషా మాత్రం తన సండే వర్క్ ఇదే అంటూ ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. తెలుగులో పెద్దగా పాపులర్ అవకపోయినా తమిళంలో అమ్మడికి లక్కీ ఛాన్సులు వస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగు అమ్మాయిగా ఇతర భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బ. సోలో హీరోయిన్ గానే కాదు స్టార్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించిన అమ్మడు కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.

తెలుగులో అరకొర అవకాశాలతో కెరీర్ వెల్లదీస్తున్న ఈషా తమిళంలో మాత్రం సూపర్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. మన వాళ్లేమో కన్నడ మళయాళ తమిళ భాషల వైపు చూస్తుంటే అక్కడ వారు మాత్రం తెలుగు అమ్మాయిల మీద ఆసక్తి చూపిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.