Begin typing your search above and press return to search.

మరో బోల్డ్‌ పాత్రలో తెలుగమ్మాయి

By:  Tupaki Desk   |   13 Aug 2020 2:45 AM GMT
మరో బోల్డ్‌ పాత్రలో తెలుగమ్మాయి
X
తెలుగమ్మాయి ఈషారెబ్బా హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది. చిన్న హీరోలకు జోడీగా నటించిన ఈమెకు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించాలనే కోరిక అలాగే ఉండి పోయింది. ముంబయి ముద్దుగుమ్మల మాదిరిగా అందాల ప్రదర్శణ చేసినా కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో మాత్రం ఆఫర్లు రావడం లేదు. ఈ సమయంలోనే ఈమె వెబ్‌ సిరీస్‌ ల్లో నటించేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే హిందీలో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన లస్ట్‌ స్టోరీస్‌ తెలుగు వర్షన్‌ లో కీలకమైన ఒక బోల్డ్‌ పాత్రలో నటిస్తోంది.

ఆ పాత్ర ఖచ్చితంగా ఈషా రెబ్బ గురించి అంతా మాట్లాడుకునేలా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. ఇదే సమయంలో మరో వెబ్‌ సిరీస్‌ లో కూడా ఈమె నటించబోతుంది. సంపత్‌ నంది ఒక వెబ్‌ సిరీస్‌ ను నిర్మించబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆ వెబ్‌ సిరీస్‌ లో ఈషా రెబ్బ నటించబోతుందట. అది కూడా లస్ట్‌ స్టోరీస్‌ రీమేక్‌ లోని పాత్ర మాదిరిగానే చాలా బోల్డ్‌ గా ఉంటుందని హైదరాబాద్‌ నైట్‌ లైఫ్‌ ఫోకస్‌ చేస్తూ సాగే ఆ వెబ్‌ సిరీస్‌ లో ఈషాకు మంచి పాత్ర దక్కిందని అంటున్నారు. ఈ రెండు వెబ్‌ సిరీస్‌ లతో అయినా ఈ అమ్మడికి స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కేనా చూడాలి.