చీరకట్టులో అదరగొట్టిన తెలుగు హీరోయిన్!

Wed Oct 09 2019 13:46:21 GMT+0530 (IST)

Eesha Rebba Glamourous pose in Saree

దసరా పండుగను మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇక సినిమా వాళ్ళ గురించైతే చెప్పక్కర్లేదు. స్టార్స్ అందరూ ఈ పండుగను చాలా వైభవంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ మన తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రధారణతో అందంగా ముస్తాబై ఈ పండుగను చేసుకుంటారు. అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఈ సంవత్సరం దసరా చాలా ఆనందంగా జరుపుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెప్తూ ఒక పిక్ షేర్ చేసింది.ఆమె ఈ పిక్ లో చాలా అందంగా మెరిసిపోతుంది. పిక్ లో ఆమె పసుపు రంగు చీర కట్టుకుని చిరునవ్వు నవ్వుతుంది. మ్యాచింగ్ బీడెడ్ - కుందన్ నెక్లస్ - వీటికి తోడు మెరిసిపోయే గాజులతో ముస్తాబైంది. డిజైన్ చేసిన జాకెట్ - చీరలో ఉన్న ఆమె అందం మరింత వెలిగిపోతుంది. ఇలాంటి పిక్స్ - ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. సవ్యసాచి మూవీలో చిన్న క్యామియో రోల్ చేసిన ఈ చిన్నది తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. దాదాపు సంవత్సర కాలంగా ఆమె తెరపై కనపడలేదు.  ప్రస్తుతం ఆమె 'రాగల 24 గంటల్లో' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.