సుశాంత్ : రియా సోదరుడిని 18 గంటలు ప్రశ్నించిన ఈడీ

Sun Aug 09 2020 20:00:02 GMT+0530 (IST)

ED questioned Showik Chakraborty, brother of actor Rhea Chakraborty, for about 18 hours

సుశాంత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు ఈడీ వద్దకు వచ్చింది. సుశాంత్ మృతి వెనుక మనీ ల్యాండరింగ్ వ్యవహారం ఉందేమో అనే అనుమానంను ఆయన తండ్రి కేకే సింగ్ వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే బీహార్ పోలీసులకు మరియు ఈడీకి ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. దాంతో ఈడీ కూడా రంగంలోకి దిగి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆమె సోదరుడు శౌవిక్ చక్రవర్తిని కూడా ప్రశ్నించారు.ముంబయిలోని ఈడీ ఆఫీస్‌లో శౌవిక్‌ను ఏకంగా 18 గంటల పాటు ప్రశ్నించారు. అంత సమయం శౌవిక్ ను ఏం ప్రశ్నించారు అనేది తెలియాల్సి ఉంది. ఆయన్ను మళ్లీ సోమవారం కూడా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆయన ఖాతాలో భారీగా డబ్బు వచ్చి చేరింది. ఆ డబ్బు ఎక్కడిది. సుశాంత్ అకౌంట్ ద్వారా ఈయన అకౌంట్‌కు డబ్బు రావడానికి గల కారణం ఏంటీ అది సుశాంత్‌కు తెలిసి వచ్చింది. మనీల్యాండరింగ్ వ్యవహారం విషయంలో శౌవిక్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

సోమవారం కూడా ప్రశ్నించనున్న నేపథ్యంలో ఈ కేసు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. విచారణ సమయంలో ఈడీ అధికారులు అతడిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఎంక్వౌరీ కూడా మొదలు కాబోతుంది. కనుక ఆ సమయంలో కూడా ఈయన్ను మరియు రియా చక్రవర్తిని ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు.