మోహన్బాబు వల్లే బ్లాక్ బస్టర్ చేయలేకపోయాడట

Sun Jan 16 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Dr Rajasekhar About Hanuman Junction Movie

టాలీవుడ్ హీరోల్లో మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారు పేరు. అయిన టైమ్ అంటే టైమే... ఉదయం 5 గంటలకు షాట్ అంటే 4:50 కే సెట్ లోకి వచ్చేస్తుంటారు. అదీ అయిన పంక్చువాలిటీ. అదే డా. రాజశేఖర్ కు సూపర్ హిట్ సినిమాని వదులుకునేలా చేసిందట. అదేంటి? ... అంటే ఆయనో ఆసక్తికరమైన స్టోరీ చెప్పుకొచ్చారు.



యాక్షన్ కింగ్ అర్జున్ జగపతిబాబు కలిసి నటించిన `హనుమాన్ జంక్షన్` గుర్తుందా? దఆదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అర్జున్ జగపతిబాబు కెరీర్ లో మర్చిపోలేని మూవీగా నిలిచింది. నిజానికి ఈ సినిమా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డా. రాజశేఖర్ కలిసి నటించాల్సిందట. అర్జున్ స్థానంలో మోహన్ బాబు జగపతిబాబు స్థానంలో డా. రాజశేఖర్ నటించాల్సింది. అయితే మోహన్ బాబు కారణంగానే రాజశేఖర్ ఈ సినిమా వదులుకున్నారట.  

ఆయన పాటించే టైమ్ పంక్చువాలిటీనే డా. రాజశేఖర్ ఈ మూవీ చేయకుండా తప్పుకునేలా చేసిందట. టైమ్ పంక్చువాలిటీ పాటించే విషయంలో రాజశేఖర్ కాస్త దూరం. టైమ్ చెబితే ఆ టైమ్ కు రావడం చాలా అరుదు. కానీ మోహన్బాబు అలా కాదు. ఏ టైమ్ చెబితే ఆ టైమ్ కు పది నిమిషాల ముందు సెట్ లో వుంటుంటారు. దీంతో ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్ట్ వల్ల మనస్పర్థం వస్తాయని దాని వల్ల ఇద్దరి మధ్య వున్న స్నేహ బంధం దెబ్బతింటుందని ఫీలయ్యారట.  

ఆ కారణంగానే `హనుమాన్ జంక్షన్` చేయనని తప్పుకున్నారట. ఇదే విషయాన్ని నిర్మాత ఎడిటర్ మోహన్ కి వివరించడంతో ఆయన అర్జున్ జగపతిబాబులని ఎంచుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ముందు ఈ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారన్న విషయం తెలియక రాజశేఖర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. ఎప్పుడైతే తనకు మోహన్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని తెలిసిందో వెంటనే తను తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేశాడట.

రెండేళ్ల విరామం తరువాత డా. రాజశేఖర్ నటిస్తున్న చిత్రం `శేఖర్`. మలమాళ సూపర్ హిట్ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఓ రిటైర్డ్ ఆఫీసర్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.