ట్రిపుల్ ఆర్...గ్యారంటీ ఉందా... ?

Sun Oct 24 2021 05:00:02 GMT+0530 (India Standard Time)

Doubts over the moment the RRR movie started

అదేంటో తెలియదు కానీ ట్రిపుల్ ఆర్ మూవీ మొదలెట్టిన ముహూర్తం మీదనే సందేహాలు కలిగేలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మూవీని 2018 విజయదశమి వేళ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికి కచ్చితంగా మూడేళ్ళు దాటిపోయాయి. అయినా కానీ బొమ్మ థియేటర్లలోకి రావడంలేదు. ఈ దసరాకు రిలీజ్ అని మొదట్లో ప్రకటన వచ్చినా కూడా అది కాస్తా 2022కి పోస్ట్ పోన్ అయింది. జనవరి 7న రిలీజ్ అని అంటున్నారు. కానీ చూస్తే గట్టిగా రెండు నెలల సమయం మాత్రమే ఉండగా ఆ టైమ్ కైనా రిలీజ్ ఉంటుందా అంటే డౌట్లే వ్యక్తం అవుతున్నాయి.దానికి అనేక కారణాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సింగిల్ గా రావడం లేదు. రాధేశ్యామ్ కూడా పోటీగా వస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీవే. మరో వైపు చూస్తే పవర్ స్టార్ భీమ్లా నాయక్ కూడా రేసు లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట తో పాటు నాగార్జున బంగార్రాజు కూడా రెడీ అనే అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ మూవీ కేజీఎఫ్ టూ కూడా రావచ్చు అన్న మాట కూడా ఉందిట.

మరి ఇలాంటి సంకుల సమరంలో ట్రిపుల్ ఆర్ కి న్యాయం జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. సరే ఇందులో కొన్ని సినిమాలు డేట్లు మార్చుకున్నా కూడా సోలో పోటీ అయితే ఉండదు. ట్రిపుల్ ఆర్ లాంటి మూవీకి కనీసం పదినేను రోజులైనా సోలోగా వదిలేస్తేనే బాగుంటుంది కలెక్షన్లు కూడా సేఫ్ గా ఉంటాయి అన్న బిజినెస్ టాక్ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు మళ్లీ చైనా రష్యా యూకే లాంటి చోట్ల కరోన కేసులు మళ్ళీ పెద్ద ఎత్త్న పెరుగుతున్నాయి. మూడవ దశకు అవి సంకేతం అంటున్నారు.

ఇక భారత్ లో కూడా మూడవ దశ డిసెంబర్ లో మొదలవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇలా చాలా ప్రతికూల అంశాలు కూడా ట్రిపుల్ ఆర్ కి మళ్లీ బ్రేకులు వేయవచ్చు అన్న మాట అయితే ఉంది. మొత్తానికి అంటు నందమూరి ఇటు మెగా వారసుడు రేర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ ఆర్ ని చూడాలని ఎంత బలంగా ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ కి ఉన్నప్పటికీ ఈ మూవీ రాక అంత ఆలస్యం అవుతోంది అంటున్నారు.