Begin typing your search above and press return to search.

దిశా కేసులోకి నన్ను లాగొద్దు.. F**K ఫేక్ న్యూస్ : సూరజ్ పంచోలి

By:  Tupaki Desk   |   6 Aug 2020 6:15 AM GMT
దిశా కేసులోకి నన్ను లాగొద్దు.. F**K ఫేక్ న్యూస్ : సూరజ్ పంచోలి
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్ని రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి మరణం వెనుక ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్ - సూరజ్ పంచోలీ లాంటి వారు ఉన్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని... ఆ విషయం సుశాంత్ కు తెలిసిందని... అందుకే ఆమెను సుశాంత్ ను ఇద్దరినీ సూరజ్ హత్య చేయించి ఆత్మహత్యలుగా చిత్రీకరించి ఉండొచ్చని.. గతంలో హీరోయిన్ జియా ఖాన్ ని కూడా సూరజ్ ప్లాన్ చేసి హత్య చేసారని.. సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అప్పుడే ఈ వార్తలపై సూరజ్ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడి క్లారిటీ ఇచ్చాడు. 'తనకు సంబంధం లేని విషయంలోకి తనను లాగుతున్నారని.. దిశ అనే అమ్మాయిని తాను ఒక్కసారి కూడా కలవలేదని.. 2017లో సుశాంత్ తో తాను గొడవ పడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని' చెప్పుకొచ్చాడు సూరజ్.

కాగా ఇప్పుడు సుశాంత్ - దిశాల సూసైడ్స్ లో మరికొన్ని విషయాలు వెలుగుచూస్తున్న తరుణంలో మరోసారి సూరజ్ పంచోలీ పేరు తెరమీదకి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఓ జాతీయ మీడియా ఛానెల్ లో సూరజ్ కి దిశాకు సంబంధాలు ఉన్నాయని.. ఆమెతో సూరజ్ కలిసి ఉన్న ఫోటో ప్రసారం చేసింది. దీనిపై సూరజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశాడు. మీడియా ఛానల్ లో వస్తున్న ఫోటోని జతచేస్తూ ''కంప్లీట్ బుల్ షిట్. #F**kYouFakeMEDIA ఇలాంటి మీడియాను మనం నమ్ముతున్నామా?. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి దిశా సలియాన్ కాదు. అది 2016లో నా స్నేహితురాలు అనుశ్రీ గౌరీతో తీసుకున్న ఫోటో. ఆమె ప్రస్తుతం ఇండియాలో కూడా లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలతో జనాల బ్రెయిన్ వాష్ చేయకండి. నన్ను ఇందులోకి లాగకండి. బాధ్యత లేకుండా ఇతరుల జీవితాలతో ఆడుకోకండి. నేను ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. నేను ఇప్పటివరకు దిశా అనే అమ్మాయిని కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. ఇప్పటి దాకా జరిగింది చాలు. F**K YOU AND F**K YOUR FAKE NEWS!'' అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఆగ్రహం వ్యక్తం చేశాడు సూరజ్ పంచోలీ. అయితే దేనికి నెటిజన్స్ మరికొన్ని ఫోటోలను కామెంట్స్ బాక్స్ లో పెడుతూ 'ఈ ఫొటోలో నీ పక్కన ఉన్న అమ్మాయి దిశా కాదా?' అని ప్రశ్నిస్తున్నారు.