Begin typing your search above and press return to search.

ట్రంప్ హాలీవుడ్ ఎంట్రీ కూడా బెదిరింపేనా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 1:52 PM GMT
ట్రంప్ హాలీవుడ్ ఎంట్రీ కూడా బెదిరింపేనా?
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండియా అంతా ఊగిపోతున్న పేరు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండియాకి వ‌చ్చిన ట్రంప్ గురించి ఊరు వాడ మాట్లాడుకుంటుంది. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా క‌న్నా ట్రంప్ ఇండియాలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్నారు. భార‌తీయులు మంచి వాళ్లు అంటూనే...అమెరికా నుంచి ఇండియ‌న్స్ గెంటేయ‌డానికి ఏ మాత్రం ఆలోచించ‌ని వ్య‌క్తిత్వం గ‌ల‌వారు. మోదీ నా ప్రెండ్..ఇండియా న‌చ్చింది అంటూనే....అమెరికా వైట్ హౌస్ లో కూర్చుని భార‌తీయుల భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో ఉంటారు. ఇక మిగ‌తా విష‌యాల్లోనూ ట్రంప్ దూకుడు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ దేశాన్నైనా హెచ్చ‌రించ‌గ‌ల‌రు? ఎంత‌టి వారితోనైనా క‌య్యానికి కాలు దువ్వే ర‌కం.

అలా క‌య్యానికి కాలు దువ్వే సినిమాల్లో కూడా అవ‌కాశాలు ప‌ట్టేసారు? అన్నవిష‌యం ఎంత మందికి తెలుసు. ఇండియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ట్రంపు గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడే కాదు..హాలీవుడ్ న‌టుడు కూడా. హామ్ అలోన్-2.. లాస్ట్ ఇన్ న్యాయ‌ర్క్ చిత్రాల్లో ట్రంపు అతిథి వేషాలు వేసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. టూ వీక్స్ నోటీస్ అనే చిత్రంలో అందాల భామ సాండ్రా బుల్లోక్ తో రొమాన్స్ చేసాడు. బెన్ స్టిల్లర్, ఓవెన్ విల్సన్‌తో కలిసి జూలండర్ చిత్రంలోనూ న‌టించారు.

`సెక్స్ అండ్ ది సిటీ` అనే టెలివిజ‌న్ సీరియ‌ల్ లో కూడా న‌టించారుట‌. ట్రంపు సినిమా ఎంట్రీ కూడా వివాదంగానే జ‌రిగింది. అమెరికాలోని త‌న హోట‌ల్ లోని షూటింగ్ జ‌రుపుకోవ‌డానికి ఓ సినిమా యూనిట్ వ‌చ్చిందిట‌. అక్క‌డ ట్రంపు ఆ యూనిట్ ఓ కండీష‌న్ పెట్టారుట‌. మీ సినిమాలో ఛాన్స్ ఇస్తే హోట‌ల్ అద్దెకి ఇస్తాను? లేదంటే ఇవ్వ‌ను అన్నాడుట‌. దీంతో అప్ప‌టిక‌ప్పుడు ట్రంపు కోసం ద‌ర్శ‌కుడు ఓ రోల్ క్రియేట్ చేసాడుట‌. అలా ట్రంప్ గారి ఎంట్రీ హాలీవుడ్ లో జ‌రిగిందిట‌.