Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి విజ‌య్ కి తండ్రితో మాట‌లు లేవా?

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 AM GMT
ద‌ళ‌ప‌తి విజ‌య్ కి తండ్రితో మాట‌లు లేవా?
X
త‌మిళ ఇండ‌స్ట్రీలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వంద కోట్ల రెమ్యున‌రేష‌న్ ని ప్ర‌తి సినిమాకు డిమాండ్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా విజ‌య్ 'వారీసు' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించారు. తెలుగులో ఇదే మూవీని 'వార‌సుడు'గా ఈ సంక్రాంతికి విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

త‌మిళంలో అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయింది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న నిర్మాత దిల్ రాజు అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేసింది. సంక్రాంతి బ‌రిలో తెలుగు సినిమాల‌కు పోటీగా విడుద‌లైన ఈ మూవీ ఏ విష‌యంలోనూ పోటీగా నిల‌బ‌డ‌లేక డిజాస్ట‌ర్ అనిపించుకుని నిర్మాత దిల్ రాజుకు ఊహించ‌ని షాక్ నిచ్చింది. ఇదిలా వుంటే హీరో ఎస్‌.ఏ చంద్ర‌శేఖ‌ర్ త‌న కొడుకు విజ‌య్ తో త‌న‌కు మాట‌లు లేవ‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌. ఏ. చంద్ర‌శేఖ‌ర్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు త‌న కుమారుడు విజ‌య్ కి మ‌ధ్య గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా స‌రిగా మాట‌లు లేవ‌న్న విష‌యం నిజ‌మేన‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. అయితే అదేమీ చ‌ర్చించుకోవాల్సిన పెద్ద విష‌యం ఏమీ కాద‌న్నారు. తండ్రీ కొడుకులు అన్నాక చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం స‌హ‌జం అన్నారు.

అంతే కాకుండా తిరిగి క‌లుసుకోవ‌డం స‌హ‌జం అని తెలిపారు. విజ‌య్ కు నేనంటే ఎంతో ఇష్టం. నాతో ఎంతో క్లోజ్‌గా వుండేవాడు. సినిమాల త‌రువాత నేను విజ‌య్ కే ప్రాధాన్య‌త ఇస్తాను.ఆ త‌ర్వాతే నా భార్య‌.

అయితే కొన్ని చిన్న చిన్న విష‌యాల్లో విజ‌య్ తో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం వ‌ల్ల గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా నేను, విజ‌య్ పెద్ద‌గా మాట్లాడుకోవ‌డం లేద‌న్నారు. అయితే అది మా దృష్టిలో పెద్ద విష‌య‌మే కాద‌న్నారు. మేమిద్ద‌రం గొడ‌వ‌లు ప‌డ‌తాం త‌రువాత క‌లిసిపోతాం అని తెలిపారు.

తండ్రీ కొడుకుల సంబంధంలో ఇలాంటివి స‌ర్వ‌సాధ‌ర‌ణం అని, ఇటీవ‌ల మేమంతా క‌లిసి 'వారీసు' సినిమా చూశాం అన్నారు. ఇదిలా వుంటే విజ‌య్‌కి ఆయ‌న తండ్రికి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తడానికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌కీయ పార్టీ విష‌యంలో ఏర్ప‌డిన విభేధాలేన‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఆ విష‌యంలో విజ‌య్ హార్ట్ కావ‌డం, అది కోర్టు వ‌ర‌కు వెళ్ల‌డం త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.