అగ్ర నిర్మాత మైండ్ గేమ్ ఫలిస్తుందా?

Fri Dec 06 2019 10:37:51 GMT+0530 (IST)

Does Big Producer Mind Game Workout Or Not?

ఏదైనా సినిమాకు బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటే టెన్షన్ మామూలే. అందుకే ఏ నిర్మాత అయినా ఆ మాట బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్‌బాబు మాత్రం వెంకీమామ కాస్ట్ ఫెయిల్యూర్ సంగతిని పదే పదే బాహాటంగానే చెప్పేస్తుండడం విస్మయపరుస్తోంది. సోదరుడు వెంకటేష్.. మేనల్లుడు నాగచైతన్యతో `వెంకీమామ` లాంటి మల్టీస్టారర్ ను డి.సురేష్ బాబు అండ్ కో నిర్మించిన విషయం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13న సోలోగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.రియల్ లైఫ్ మామా అల్లుళ్లు తెరపైనా రియాలిటీనే ప్రతిబింబించబోతుండడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఊరి పెద్ద మనిషిగా.. రైతుగా వెంకీ.. బార్డర్ లో సైనికుడిగా నాగచైతన్య కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటి. ఆరంభం అనుకున్న బడ్జెట్ వేరు. చివరికి తేలిన లెక్క వేరు. అయితే బడ్జెట్ విషయంలో ఈ లెక్కల్ని స్వయంగా సదరు అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ కం పంపిణీదారుడు స్వయంగా తమ సంస్థకు చెందిన వ్యక్తుల నుంచే లీకులు చేయించడం పరిశ్రమలో చర్చకు వచ్చింది.

తొలుత కంపెనీ నుంచి లీకులిచ్చి ఇప్పుడు 54 కోట్లు బడ్జెట్ అయ్యిందంటూ సురేష్ బాబు స్వయంగా ఓపెనవ్వడం వేడెక్కిస్తోంది. దీన్ని ఆయనే ఎందుకు బయటపెట్టాలి?  దీని వెనక మర్మం ఏమిటి? అంటూ పంపిణీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అనూహ్యంగా హైప్  పెంచి బయ్యర్ల నుంచి ఇంకేదైనా ఆశిస్తున్నారనే సంకేతాలు వెళ్లాయిట. అందుకే ఇలా బడ్జెట్ తడిసిమోపెడు అయ్యిందని.. ఆ కారణంగానే సంక్రాంతికి పోటీపడకుండా డిసెంబర్ 13న సోలో రిలీజ్‌కు ప్లాన్ చేశారని మైండ్ గేమ్ ఆడుతున్నారని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది బాబు కావాలని ఆడుతున్న గేమ్ అన్న వాదనా ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో కశ్మీర్ ఎపిసోడ్ హైలైట్. దానికి మినహా బడ్జెట్ ఏమీ పెరగలేదని.. ఆ ఒక్క బూచీని చూపించి సురేష్ బాబు సినిమా బడ్జెట్ పెరిగిందని పదే పదే తన టీమ్ తో ప్రచారం చేయిస్తున్నాడని సినిమా బాగుంటేనే ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అది ఆయన గ్రహించాలని కొంత మంది బయ్యర్లు కొలీగ్స్ కి చురకలు అంటిస్తున్నారట. 55 కోట్ల మేర షేర్ వసూలు చేయడం అంటే ఆషామాషీ కాదు అన్న చర్చ కూడా బయ్యర్లు.. పంపిణీవర్గాల్లో సాగుతోంది.