మెగాస్టార్ భోళా శంకర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Sat Jan 28 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Do you know when Megastar Bhola Shankar will release

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి మాస్ కమర్షియల్ జోనర్ లోకి వచ్చిన చిరంజీవి ఒకప్పటి ఎనర్జీని తెరపై చూపించి ప్రేక్షకులని అలరించాడు. దీంతో సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మాస్ సినిమాలపైనే ఫోకస్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే  ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని చిరంజీవి చేయబోతున్న సంగతి తెలిసిందే.2015లో తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాలం మూవీ రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే ఒరిజినల్ స్టొరీ లైన్ మాత్రమే తీసుకొని మెగాస్టార్ ఇమేజ్ ని తగ్గట్లుగానే మెహర్ రమేష్ మార్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే యాక్షన్ ఎలిమెంట్స్ సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ గా ఉండనున్నాయి.

 ఇదిలా ఉంటే ఈ సినిమాని వీలైనంత వేగంగా రిలీజ్ చేసి నెక్స్ట్ సినిమాకి వెళ్లాలని చిరంజీవి అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా  ఉంటే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మే 12న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.మార్చి నాటికి సినిమా షూటింగ్ చేసి రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి మేలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

రీమేక్ సినిమా కావడంతో మరీ ఎక్కువ టైం తీసుకున్న నిర్మాతకి ఖర్చు పెరిగి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని మెగాస్టార్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో మెహర్ రమేష్ కి స్క్రిప్ట్ ని బౌండెడ్ రెడీ చేసేందుకు ఏడాది సమయం చిరంజీవి ఇచ్చారు. ఇప్పుడు పెర్ఫెక్ట్ గా ఎడిటింగ్ వెర్షన్ రెడీ కావడంతో రిలీజ్ కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.