Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే నాన్న ఫేవరేట్‌ మూవీ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   18 Oct 2021 8:30 AM GMT
పూజా హెగ్డే నాన్న ఫేవరేట్‌ మూవీ ఏంటో తెలుసా?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో యంగ్ స్టార్‌ హీరోలందరితో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తమిళం మరియు హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవల ఈమె నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా విడుదల అయ్యింది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పూజా హెగ్డే నటించిన సినిమా చాలా కాలం తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో సందడి చేస్తున్న మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా హీరోయిన్ పూజా హెగ్డేకు మరోసారి మంచి బ్రేక్ ఇచ్చిందనే కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పూజా హెగ్డే మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నేను నటించే తెలుగు సినిమాలు అన్ని కూడా చూస్తారు. వారు ఇద్దరు కూడా నా సినిమాలకు పెద్ద విమర్శకులు. నా నటన గురించిన వ్యాఖ్యలు చేయడంతో పాటు నేను ఏదైనా మార్చుకోవాల్సి ఉంటే తప్పకుండా చెప్తారు అంది. నాన్న కు నేను అల్లు అర్జున్ తో కలిసి నటించిన డీజే సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాను చాలా సార్లు చూశాడు. ఇంకా చూస్తూనే ఉంటాడు. ఆ సినిమా 2016 లో వచ్చిన డీజే సినిమానే ఇంకా ఆయన ఫేవరేట్‌ సినిమా అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక తన తల్లికి కూడా నేను నటించిన సినిమాల్లో మాస్ మసాలా ఎంటర్ టైన్‌ మెంట్‌ సినిమాలు అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ చెప్పుకొచ్చింది.

ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ విడుదల అవ్వడంతో మరో మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ రాధే శ్యామ్‌ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగు లోనే కాకుండా రాధే శ్యామ్‌ ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారు. కనుక ఆ సినిమా తో పూజా పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా స్టార్‌ డమ్ దక్కించుకోవడం ఖాయం. ఇక బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్ తో ఆఫర్‌ వచ్చిందనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా విషయమై స్పష్టత రావాల్సి ఉంది. తమిళంలో సూపర్‌ స్టార్ విజయ్‌ తో నటించే అవకాశంను దక్కించుకుంది. మొత్తంగా పూజా హెగ్డే సౌత్ మరియు నార్త్‌ లో బిజీ బిజీగా ఉంది.