బలగం ఎన్ని కోట్లు లాభం తెచ్చిపెట్టిందో తెలుసా?

Fri Mar 17 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Do you know how many crores of profit the Balagam has made?

బలగం సినిమా విడుదలై ఇప్పటికే పూర్తిగా 14 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయింది. మార్చి మూడవ తేదీని విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి వారం దాదాపుగా ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రెండోవారం కూడా 8 కోట్ల పది లక్షల దాకా గ్రాస్ వసూలు రాబట్టింది.దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ప్రారంభించిన కొత్త ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ లభించింది. తెలంగాణలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలాంటి సంప్రదాయాల ప్రకారం ఆయనను సాగనంపుతారు... సాగనంపిన తరువాత ఎలాంటి ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు.

 చావు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ వాసులందరికీ కనెక్ట్ అవడమే గాక ఆంధ్ర ప్రాంత వారందరికీ కూడా బాగా దగ్గరయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 14 కోట్ల 87 లక్షల గ్రాస్ వసూలు చేస్తే 6 కోట్ల 78 లక్షల షేర్ వసూలు చేసింది. బలగం సినిమా 14 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే నైజంలో 9 కోట్లు 46 లక్షల గ్రాస్ మిగతా ఆంధ్ర ప్రాంతం అలాగే సీడెడ్ ప్రాంతాల్లో కలిపి ఐదు కోట్ల 41 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం ఓవర్సీస్ లో కలిపి 33 లక్షల వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 20 లక్షల గ్రాస్ 6 కోట్ల 94లక్షల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా కోటి 15 లక్షల బిజినెస్ జరుపుకుంది. బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా కోటి 30 లక్షలు నిర్ణయించారు. అలా ఈ సినిమా ఇప్పటివరకు ఐదు కోట్ల 64 లక్షల లాభాలు తీసుకురావడమే కాక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.