Begin typing your search above and press return to search.

VD ని చూసి ఆ హీరోలు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నారా..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
VD ని చూసి ఆ హీరోలు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నారా..?
X
సినీ ఇండస్ట్రీలో పోటీ అనేది సర్వసాధారణం. పోటీతత్వం ఉంటేనే బెస్ట్ ఔట్ ఫుట్ వస్తుందని అంటుంటారు. ఇక టాలీవుడ్ హీరోల మధ్య పోటీ అనేది ఎప్పటికీ వుంటుంది. అది ఆరోగ్యకరమైనదే అయితే ఇబ్బందేమీ లేదు. ఒక హీరో సూపర్‌ హిట్ కొడితే.. మనం దాన్ని మంచి హిట్ కొట్టాలని ఇతర హీరోలు ఇంకాస్త ఎక్కువ కష్టపడటానికి అవకాశం కల్పిస్తుంది. కాకపోతే ఓ హీరో ఎదుగుదల చూసి మిగతా హీరోలు ఈర్ష్య పడుతూ.. ఇన్ సెక్యూర్ ఫీల్ అయితేనే ఇబ్బంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ను చూసి పలువురు హీరోలు అలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమా సినిమాకి తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత భారీ యూత్ ఫాలోయింగ్ తెచ్చకున్న విజయ్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ మీద దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ ను వరుసగా మూడోసారి సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో లేటెస్టుగా పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ డబూ ర‌త్నాని తన క్యాలెండర్ లో వీడీ కి చోటు కల్పించాడు.

డబూ ర‌త్నాని క్యాలెండర్ మీద కనిపించిన ఫస్ట్ సౌత్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ స్టన్నింగ్ పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. దీంతో వెంటనే విజయ్ కు పోటీగా కొందరు హీరోలు సిక్స్ బాడీతో ఉన్న ఫోటోలు.. ఆబ్స్ చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వదలడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చూస్తుంటే దేవరకొండ హీరోను చూసి వీళ్ళు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నారా అనే డిస్కషన్ మొదలైంది. పలువురు బాలీవుడ్ కుర్ర హీరోలు సైతం ట్రెండ్ సెట్ట‌ర్ గా మారుతున్న వీడీ ని చూసి వర్రీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.