స్టార్ హీరో పేరు చెబితే ఫైనాన్షియర్స్ పారిపోతున్నారా?

Mon Aug 15 2022 16:30:10 GMT+0530 (India Standard Time)

Do the financiers run away at the mention of the star hero's name?

టాలీవుడ్ లో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కంటెంట్ సరిగా లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఎంత భారీ బడ్జెట్ తో నిర్మించినా.. అందులో స్టార్ హీరో నటించినా కంటెంట్ లేకపోతే ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటి సినిమాలకు థియేటర్లకు రావడం లేదు. దీంతో నిర్మాతలు దర్శకులు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ విషయాన్ని ఇప్పడు దూతద్దంలో పెట్టి చూస్తున్నారు.ఫైనాన్షియర్లు కూడా ఇదే పంథాను అనుసరిస్తూ కొత్తగా నిర్మాతలకు స్టార్ హీరోల ప్రాజెక్ట్ లకు షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరో సినిమా అంటే స్టార్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తో పాటు ఫైనాన్షియర్లు కూడా పారిపోతున్నారట.

సినిమా ఇండస్ట్రీలో ఎవరి స్టార్ డమ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవరికి తెలియదు. ఒక దశలో పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేసిన వారు ఆ తరువాత కాలంలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న సందర్భాలు చాలానే వున్నాయి.

అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఓ స్టార్ హీరో పేరు చెబితే స్టార్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తో పాటు ఫైనాన్షియర్లు కూడా పారిపోతున్నారట. కారణం ఈ మధ్య కాలంలో సదరు స్టార్ హీరో తన ప్రాజెక్ట్ ల షూటింగ్ ల విషయంలో వ్యవహరిస్తున్న తీరే అని తెలుస్తోంది. రీమేక్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సదరు స్టార్ హీరో ఈ మధ్య ఓ భారీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే దాన్నిపూర్తి చేయడం లేదు.. తిరిగి ప్రారంభించడం లేదు.

తను అంగీకరించిన మరో ప్రాజెక్ట్ ని ఎప్పుడు ప్రారంభిస్తాడో ప్రొడ్యూసర్ లకు కూడా క్లారిటీ లేదట. ఇక ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ఎండవుతుందో తెలియని సదరు స్టార్ హీరో ప్రాజెక్ట్ లకు ఫైనాన్స్ చేయడానికి ఫైనాన్షియర్లు ముఖం చాటేస్తున్నారట. ఇప్పటికే ఒక సినిమా సెట్స్ పై మధ్యలో ఆగిపోయింది. మరో రెండు సినిమాలు పట్టాలెక్కాల్సి వుంది. ఇదివి ఎప్పుడు పూర్తవుతాయన్న దానిపై డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు క్లారిటీ లేదట.

ఇదే ఇప్పడు ఫైనాన్షియర్లని ఇబ్బందిపెడుతోందని ఈ నేపథ్యంలో వారు నిర్మాతలకు కండీషన్స్ పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సరైన డెడ్ లైన్ తో వస్తేనే ఫండింగ్.. లేదంటే కష్టం అని చెప్పేస్తున్నారట. ఇప్పుడిది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.