ఇండస్ట్రీ పెద్దలు ఆ దిశగా ఆలోచిస్తారా...?

Sun Aug 02 2020 16:40:00 GMT+0530 (IST)

Do industry leaders think in that direction ...?

దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీ గత నాలుగు నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది క్యారక్టర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు చిన్న టెక్నిషియన్స్ రోజువారీ శ్రామికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదని చెప్పవచు. అయితే ప్రభుత్వాలు కొన్ని షరతులతో సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతించాయి. ఈ నేపథ్యంలో షూటింగ్స్ ఆపేసుకున్న సినిమాల చిత్రీకరణ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్స్ అంటే లైఫ్ రిస్క్ చేయడమేనని ఆ ఆలోచన విరమించుకున్నారు.కాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరపబోతున్నట్లు అనౌన్స్ చేసారు. ఈ ఆగష్టు నెలలోనే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తోపాటు మరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా టైంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. అయితే మన ఇండస్ట్రీలో ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అయ్యి నష్ట పోతున్నారని అర్థం అవుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే వారు సర్వ నాశనం అయ్యే పోజిషన్ కి వచ్చేసారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్న సంస్థలు కరోనా సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని గమనించి టాలీవుడ్ లో కూడా అదే పద్ధతి ఫాలో అయితే బావుంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని షూటింగ్స్ అయినా స్టార్ట్ చేస్తే ఎన్నో కుటుంబాలకు మళ్ళీ జీవనోపాధి దొరుకుతుంది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.