ఫ్యాన్స్ కి ఆ రైట్స్ ఉన్నాయంటారా..?

Mon Feb 06 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Do fans have those rights

స్టార్ కాంబినేషన్ సినిమా అనేసరికి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవడం కోసం దర్శకుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈమధ్య స్టార్ సినిమాలకు మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా మారింది. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం కూడా స్టార్ సినిమాలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే హీరో డైరెక్టర్ కాంబో ఫిక్స్ అయితే లేటెస్ట్ గా ఆ సినిమాకు మ్యూజిక్ ఎవరన్నది కూడా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఎంచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమకు నచ్చకపోతే ట్రోల్స్ చేస్తున్నారు.హీరోకి కథ చెప్పి ఒప్పించిన డైరెక్టర్ కి ఆ సినిమాకు ఎవరితో మ్యూజిక్ చేయించాలో ఆమాత్రం ఐడియా ఉండదా.. కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం తమకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ వద్దు ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒక స్టార్ హీరో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకరిని ఫిక్స్ చేయగా ఆ కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ మా హీరో సినిమాకు వద్దు మాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెస్పాండ్ అయ్యాడు.

అభిమాన హీరో సినిమా వారి అంచనాలకు తగినట్లుగా ఉండాలని కోరుకోవడం కరెక్టే కానీ సినిమా టెక్నికల్ టీం ని వీరు డిసైడ్ చేసినట్టుగా ఉండాలని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. వాళ్లు వద్దు వీళ్లు కావాలి అంటూ సినిమా యూనిట్ ని నిర్ణయించే రైట్ ఫ్యాన్స్ కి అసలు లేదు. కొన్ని కాంబినేషన్స్ అనుకున్నప్పుడే అంతా సెట్ అవుతాయి. అలా కాకుండా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరు మేం చెప్పినట్టే జరగాలి అంటే మాత్రం కుదరదు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆ హీరో ఫ్యాన్స్ ఆ టెక్నిషియన్ ని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆ హీరో ఫ్యాన్స్ ఆలోచన మార్చుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.

ఇక 11 ఏళ్ల తర్వాత డైరెక్టర్ హీరో కాంబో సినిమా వస్తుంది. మరి ఈ రేర్ కాంబినేషన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన బ్లడ్ పెట్టేస్తాడని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనని వద్దని వారిస్తున్న ఆ స్టార్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే మ్యూజిక్ తో సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే అదే క్రెక్ట్ అని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.