Begin typing your search above and press return to search.

దివ్యాన్ష.. ఇలా హీటెక్కిస్తే ఎలా పాప?

By:  Tupaki Desk   |   7 Jun 2023 11:00 AM GMT
దివ్యాన్ష.. ఇలా హీటెక్కిస్తే ఎలా పాప?
X
మజిలీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ దివ్యాన్ష కౌశిక్ ని అంత ఈజీగా ఎవరూ మరిచిపోరు. ఆ మూవీలో నాగ చైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది. అయితే మజిలీ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కంటే సమంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మూవీ క్రెడిట్ మొత్తం ఆమెకి వెళ్ళిపోయింది.

ఈ మూవీ తర్వాత రవితేజకి జోడీగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక సందీప్ కిషన్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ మైఖేల్ తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. అలాగే ఇక నాగ శౌర్యకి జోడీగా పోలీసువారి హెచ్చరిక అనే సినిమా కూడా ఈ బ్యూటీ సైన్ చేసింది.

ఈ మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సిద్దార్ద్ తో టక్కర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాపై సిద్దార్ద్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తెలుగులో ఈ మూవీతో మరల గ్రాండ్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే దివ్యాన్ష ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో భాగంగా ఈ అమ్మడు హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే అందంతో మెరిసిపోతోంది. ప్రస్తుతం దివ్యాన్ష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ షార్ట్ స్కర్ట్ ధరించి థైస్ అందాలు కనిపించే విధంగా రొమాంటిక్ స్టిల్స్ తో ఈ అమ్మడు కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది.

ఇదిలా ఉంటే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అయిన దివ్యాన్ష కౌశిక్ టాలీవుడ్ ద్వారానే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి కావాల్సిన గ్లామర్ షోతో నిర్మాతల దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే గ్లామర్ డోస్ విషయంలో కాంప్రమైజ్ కాకపోయినా సెలక్టివ్ గానే దివ్యాన్ష మూవీస్ చేసుకుంటూ వెళ్తూ ఉండటం విశేషం.