Begin typing your search above and press return to search.

సినిమా ప్లాప్‌ - పరిహారం కోసం బయ్యర్ల ఆందోళన!

By:  Tupaki Desk   |   16 Aug 2022 9:30 AM GMT
సినిమా ప్లాప్‌ - పరిహారం కోసం బయ్యర్ల ఆందోళన!
X
సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కాని ఫ్లాప్ అయిన సమయంలో ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమా లు ఫ్లాప్ అయిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు.. వివాదాలు... లెక్కలకు సంబంధించిన గొడవలు వస్తూ ఉంటాయి.

ముఖ్యంగా సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే నిర్మాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కామన్ విషయం. అంతే కాకుండా బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా పరిహారం అంటూ ఆందోళనలు మొదలు అవుతాయి.

స్టార్‌ హీరో సినిమాను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసే బయ్యర్లు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో నిర్మాతలను తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేయడం.. నిర్మాత స్పందించకుంటే మీడియా ముందుకు వచ్చి ఆందోళన చేయడం కామన్‌ విషయం. తాజాగా లాల్ సింగ్ చడ్డా సినిమా కు కూడా అదే జరుగుతుంది అంటూ గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

లాల్ సింగ్ చడ్డా సినిమా భారీగా బయ్యర్లకు నష్టపోయేలా చేసింది... వారు ఇప్పుడు వయాకామ్ 18 సంస్థపై ఆందోళన చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ నుండి అధికారికంగా క్లారిటీ వచ్చింది. అవన్నీ కూడా పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మా సినిమా తో బయ్యర్లకు నష్టం వచ్చింది అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ వయాకామ్ 18 సంస్థ చీఫ్‌ అజిత్ పేర్కొన్నారు. దేశ విదేశాల్లో కూడా సినిమా ను వయోకామ్ 18 సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేసింది.. అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చే అవకాశం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించాడు.

సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. దేశ విదేశాల్లో సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. కనుక సినిమా తో మాకు ఎలాంటి నష్టం రాలేదు.. సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లను పుట్టించి సినిమా ను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన తెలియజేశారు. సినిమా ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసిన వారే ఇప్పుడు ఈ ప్రచారం చేస్తూ ఉండవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.