సల్మాన్ బ్యూటీ టు-పీస్ బికినీ ట్రీట్.. పిక్ వైరల్!

Fri Jun 18 2021 19:48:17 GMT+0530 (IST)

Disha patani Latest Photo

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ చేసే గ్లామర్ షో మాములుగా ఉండదు. మాములుగా టాలీవుడ్ అందాలకంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా వయ్యారాలు కెమెరా ముందు పరిచేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో మోస్ట్ పాపులారిటి కలిగిన  బాలీవుడ్ హీరోయిన్స్ లో దిశాపటాని ఒకరు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అమ్మడు తాజాగా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకునే బికినీ ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకా బికినీలో దిశా స్టన్నింగ్ పోజు చూస్తూ కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియా ద్వారా అభిమానులను తన అందాల గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలో ఈ కుర్రభామకు బాగా తెలుసు.ఇక తాజాగా ఈ ముంబై భామ బీచ్ లో బికినీ వేసిన ఫోటో షేర్ చేసి కుర్ర హృదయాలలో సెగలు రేపుతోంది. గతంలో మాల్దీవులకు వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలను త్రోబ్యాక్ ఫోటోస్ అంటూ అందమైన ద్వీపంలో ఆమె ఎంజాయ్ చేసిన అద్భుతమైన ఫోటోలను ఈ వయ్యారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే.. దిశా బీచ్ లో హాలిడే బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక టు పీస్ టైగర్ స్కిన్ డిజైన్ బికినీ ధరించిన దిశా సోయగాన్ని చూస్తే కళ్లు తిప్పుకోలేకపోతున్నారు నేటిజన్లు. ఈ లేటెస్ట్ ఫోటోలో.. దిశా చేతిలో అలా సీ షేల్స్ పట్టుకోవడం చూడవచ్చు.

అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే అలా పిక్ పోస్ట్ చేసిందో లేదో ఆమె ఫ్యాన్స్ అలా లైక్స్ షేర్స్ తో వైరల్ చేసేస్తున్నారు. ఇటీవలే ఈ వయ్యారి రాధే సినిమాతో ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం దిశా చేతిలో కేటీనా.. ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. చూడాలి మరి త్వరలో బ్రేక్ అందుకుంటుందేమో!