Begin typing your search above and press return to search.

బులుగు స‌ముద్రానికి పింక్ బికినీ స‌వాల్

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:31 AM GMT
బులుగు స‌ముద్రానికి పింక్ బికినీ స‌వాల్
X
సీకే బేబి దిశా పటాని సోష‌ల్ మీడియాల్లో ఎంత దూకుడుగా ఉంటుందో తెలిసిందే. కేవ‌లం సామాజిక మాధ్య‌మాల ఆస‌రాగా కోట్లాది రూపాయ‌లు ఆర్జిస్తోంది. కార్పొరెట్ కంపెనీల‌తో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ కోట్ల‌లో దండుకుంటోంది. ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తూ.. క్వీన్ ఆఫ్ యాడ్స్ అన్న తీరుగా రెచ్చి పోతోంది. సోష‌ల్ మీడియాల్లో అసాధారణ ఫాలోవ‌ర్స్ ఉన్న సెల‌బ్రిటీగా వెలిగిపోతోంది. ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి దిశా ప‌టానీ ప్ర‌మోష‌న్ ప‌దింత‌లు మైలేజ్ పెంచింద‌న‌డంలో సందేహం లేదు.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే.. దిశా న‌టించిన `మళంగ్` ఫిబ్రవరి 7 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైలర్ యూత్ లో అగ్గి రాజేసింది. ట్రైల‌ర్ లో దిశా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ స్విమ్ సూట్ ట్రీట్ తో పాటు ఘాటైన పెద‌వి ముద్దులు వేడెక్కించాయి. హీరో ఆదిత్య రాయ్ తో దిశా రొమాన్స్ పీక్స్ అన్న టాక్ వినిపించింది. ఇక మైండ్ బ్లాక్ అయ్యే రేంజులో పింక్ బికినీలో దిశా ప‌టానీ రంగ‌ ప్రవేశం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ‌ని ఓ కొత్త ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో రిలీజ్ చేసింది. పింక్ బికినీలో దిశా టూ హాట్ లుక్ ఇది. బులుగు స‌ముద్రానికి పింక్ బికినీ స‌వాల్ విసిరిందా? అన్నంత‌గా ఆ ఫోటోలో ఒదిగిపోయింది దిశా.

మ‌ళంగ్ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్- అనిల్ కపూర్- కునాల్ ఖీము.. ఎల్లీ అవ్ రామ్ త‌దిత‌ర స్టార్లు న‌టించారు. ఆషిఖి 2 ఫేం మోహిత్ సూరి ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిశా ప‌టానీ షేర్ చేసిన ఫోటోల‌కు `క్వీన్` అంటూ ఓ అభిమాని వ్యాఖ్య‌ను షేర్ చేశాడు. కొందరు అభిమానులు హార్ట్ ఎమోజీలను జోడించి త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు. 7 ఫిబ్రవరి 2020 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానున్న మళంగ్ చిత్రాన్ని లవ్ రాంజన్- భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. మళంగ్ కాకుండా.. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న `బాఘి 3` లో దిశా అతిధి పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్- టైగర్ ష్రాఫ్- అంకితా లోఖండే -రితీష్ దేశ్‌ముఖ్ త‌దిత‌రులు నటించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదేగాక కెటినా అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ షాండిల్యా ర‌చ‌యిత‌. అషిమా చిబ్బర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈద్ 2020 కానుక‌గా స‌ల్మాన్ - దిశా జంట‌గా న‌టిస్తున్న `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ప్రభు దేవా దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా- జాకీ ష్రాఫ్- సోహైల్ ఖాన్ - అర్జున్ కనుంగో త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.