రెడ్ హాట్... సైడ్ యాంగిల్ లో సెగలు పుట్టిస్తోంది

Sat Apr 01 2023 10:51:54 GMT+0530 (India Standard Time)

Disha Patani Photo Talk

పూరి జగన్నాథ్ లోఫర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దిశా పటానిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన దిశా పటాని ఆ తదుపరి సంవత్సరమే అనూహ్యంగా ఎమ్మెస్ ధోని అనే హిందీ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు లభించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో కూడా హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

హీరోయిన్ గా ఇంత బిజీగా ఉన్నా ఇలా అందాల ఆరబోత చేయడంలో ఈ అమ్మడి తర్వాత ఎవరైనా అన్నట్లుగా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రస్సులో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రెడ్ డ్రెస్సులో సైడ్ యాంగిల్ నుండి అందాలని చూపిస్తున్న ఈ అమ్మడి ఫిజిక్ చూపు తిప్పుకొని ఇవ్వడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మతిపోగొడుతున్న ఈ అమ్మడి రెడ్ హాట్ అందాలు ఈ వేసవి కాలంలో చెమటలు పట్టిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోతతో అభిమానులను ఎప్పటికప్పుడు మైమరపింప చేస్తున్న దిశా పటాని ముందు ముందు హాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

గ్లోబల్ స్టార్ ఇమేజ్ అమ్మడి సొంతం అవ్వాలని.. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు రావడం ఖాయం అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.