Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బీచ్ లో దిశా బికినీయిజం

By:  Tupaki Desk   |   21 Jan 2020 8:58 AM GMT
ఫోటో స్టోరీ: బీచ్ లో దిశా బికినీయిజం
X
ఇన్నర్ వేర్లకు బ్రాండ్ అంబాజిడర్ గా పనిచేయడం అంటే కొన్నేళ్ళ క్రితం అదో బీ గ్రేడ్.. సి గ్రేడ్ వర్క్. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు అండర్ వేర్ తో కండలు తిరిగిన శరీరంతో నిలుచుని 'ఈ అండర్ వేర్ కొనండి కంఫర్ట్ గా ఉండండి' అని యమా కంఫర్ట్ గా ఫీజు పుచ్చుకుంటున్నారు. ఇక దిశా పటాని లాంటి భామ ఇన్నర్ వేర్ బ్రాండ్ ప్రమోషన్ ను ఒక కళ లా తీర్చిదిద్ది ఫ్యూచర్ జెనరేషన్ హాటు భామలకు ఓ చుక్కాని లాగా నిలిచింది.

ఈ భామ ఛాన్స్ దొరికితే చాలు ఇన్నర్ వేర్లు ధరించి.. బికినీలు ధరించి తగుదునమ్మా అని సోషల్ మీడియా హాటు పేరంటానికి రెడీ అవుతుంది. తాజాగా మరోసారి అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని బికినీ పిక్స్ పోస్ట్ చేసి "మలంగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటు బ్యూటీ నటిస్తున్న 'మలంగ్' సినిమాలోని ఘాటు సన్నివేశాలే ఇవి. ఎరుపు రంగు బికినీ ధరించి.. హాటు విప్లవానికి సిసలైన బ్రాండ్ అంబాజిడర్ లాగా పోజులిచ్చింది. నిజానికి ఈ భామ షేప్ ఎలాంటిది అంటే.. ఈ తరంలో ఏ మారాజైనా ఖజురహో టెంపుల్ కట్టాలని భావిస్తే.. దానికి నెంబర్ 1 మోడల్ గా ఎంచుకోవాల్సింది ఈ భామనే. దీనికి కొందరు జఫ్ఫాల మనోభావాలు దెబ్బతింటాయి కానీ దిశాను కొత్త ఖజురహోకు మోడల్ గా ఎంచుకోవాలని చెప్పకతప్పదు.

అసలే హాటు భామ. ఘాటు బికినీ. అందుకే టైగర్ ష్రాఫ్.. వరుణ్ ధావన్ లాంటి బాలీవుడ్ హీరోలు కూడా లైక్స్ కొట్టారు. దాదాపు 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "ఎప్పటిలాగే సూపర్ హాట్".. "జనాలను నిద్ర పోనివ్వవు".. "నువ్వు దిశా బాంబ్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. దిశ సినిమాల విషయనికి వస్తే 'మలంగ్' తో పాటు గా సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాలో కూడా నటిస్తోంది.