నీ జల్లెడ ఫ్యాంటు చూసి బుల్లెమ్మో!

Thu Oct 10 2019 22:00:42 GMT+0530 (IST)

Disha Patani Glamourous Pose

లోఫర్ బ్యూటీ దిశా పటానీకి యువతరంలో ఉన్న క్రేజు ఎలాంటిదో చెప్పాల్సిన పనేలేదు. సీకే బ్రాండ్ ప్రచారకర్తగా దిశా పేరు మార్మోగింది. నాటి నుంచి దిశా ఏ డ్రెస్ లో కనిపించినా అదో ట్రెండ్ సెట్టర్ అవుతోంది. తాజాగా ఓ విమానాశ్రయంలో అదిరిపోయే ట్రాక్ సూట్ తో కనిపించింది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో కనిపించిన దిశాని పరిశీలనగా చూస్తే అది జల్లెడ తరహాలో ఉన్న పోష్ ట్రాక్. పైన టైట్ ఫిట్ టాప్ తో కనిపించింది. ఈ స్టైల్ కుర్రకారులోకి సూటిగా దూసుకుపోయింది.ఇటీవలే ఓ పార్టీ కోసం న్యూ దిల్లీకి వెళ్లిన దిశా ఇలా కనిపించింది. విమానాశ్రయం నుంచి అలా బయటకు వస్తుంటే బోయ్స్ కళ్లు తప్పుకోలేకపోయారంటే నమ్మండి. వైట్ జాగర్స్ .. ఓపెన్ ట్రేస్ లతో జత చేసిన వైట్ టాప్ ధరించి కనిపించింది. ఆ డ్రెస్ కి తగ్గట్టే అదిరిపోయే గాగుల్స్ ని ధరించింది.

మోహిత్ సూరి దర్శకత్వంలోని `మలంగ్` చిత్రీకరణను ముగించుకుని దిల్లీలో ర్యాప్ అప్ పార్టీకి వెళుతూ ఇలా కనిపించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్- ఆదిత్య రాయ్ కపూర్-కునాల్ కీములతో కలిసి దిశా నటించింది. తదుపరి ఏక్త నిర్మించే చిత్రంలో దిశా ప్రయోగాత్మక పాత్రలో నటిస్తోంది. పంజాబ్ లోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చే అమ్మాయి పాత్రను దిశా ఈ చిత్రంలో పోషించనుంది. అమాకురాలిగా కనిపించినా తెలివితేటలున్న అమ్మాయి గా డబుల్ షేడ్ లో కనిపిస్తుందని ఏక్తా కపూర్ చెబుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి రాజ్ షాండిల్యా రచయిత. ఆషిమా దర్శకత్వం వహిస్తున్నారు.