Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: వీడైతే నో రికార్డ్స్.. జీరో రిస్క్

By:  Tupaki Desk   |   6 Dec 2019 10:23 AM GMT
టీజర్ టాక్: వీడైతే నో రికార్డ్స్.. జీరో రిస్క్
X
వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'డిస్కోరాజా'. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్.. తాన్యా హోప్.. బాబీ సింహా.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ విడుదలయింది. ఒక నిముషానికి పైగా ఉన్న ఈ టీజర్ లో సినిమా కథకు కొంచెం హింట్ ఇచ్చారు.

టీజర్ ఆరంభంలో షర్టు పైన వేసుకున్న ఏప్రాన్ తీసి అవతల పారేసి.. ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం చేస్తూ.. హెల్త్ కు ఇంజ్యూరియస్ అయిన డ్రింక్ చేస్తూ స్టైలిష్ గా నడుస్తూ "అ యామ్ డన్ విత్ ది ఫ** క్రాప్'(ఈ చెత్త పని పూర్తి చేశాను) అంటూ రవితేజ స్టైలిష్ ఎగ్జిట్ ఇస్తాడు. కట్ చేస్తే కొన్ని యాక్షన్ సీన్స్. తర్వాత వాయిస్ ఓవర్ లో ఒక వ్యక్తి "మెడిసిన్ ఈజ్ ఛేంజింగ్ ది వెరీ నేచర్ ఆఫ్ నేచర్"(వైద్యశాస్త్రం ప్రకృతి ధర్మాలనే మారుస్తోంది). మరో సీన్లో "మనం ఈ ప్రాజెక్ట్ చెయ్యకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ మనకి వార్నింగ్ ఇచ్చింది" అంటూ తాన్యా హోప్ తన బాస్ తో చెప్తుంది. "వీడైతే నో రికార్డ్స్.. నో రిపోర్ట్స్.. నో రిలేటివ్స్.. జీరో రిస్క్.. వుయ్ ఆర్ గోయింగ్ టు బీ గాడ్స్") అంటూ మరో డైలాగ్.

అన్ని ముక్కలని కలుపుకుని ఒక ఆర్డర్ లో చెప్పుకుంటే. ఒక మెడికల్ రీసెర్చ్. మెడికల్ అసోసియేషన్ అనుమతి ఉండదు. ఇలాంటి రీసెర్చ్ కోసం ఏకంగా మాస్ రాజానే ఎంచుకుంటారు. ఆయన మాస్ రాజా అని వారికి తెలియదు కదా.. అది తెలిసిన తర్వాత.. మాస్ రాజాపై ప్రయోగం పూర్తయిన తర్వాత ఏం జరిగింది అనేది.. వారి దుంప మాస్ రాజా ఎలా తెంచి డిస్కో రాజా అనిపించుకున్నాడనేది అసలు కథ. ఇక సూటు బూటులో.. చలువకళ్ళజోడు పెట్టుకుని మాస్ రాజా 'ఫ్రీక్ అవుట్' అంటూ పాట పాడుతూ జేమ్స్ బాండ్.. రోబో రజని తరహాలో చుట్టూ రౌండప్ చేసిన వారి గన్నుల పొజిషన్ మార్చి వారికి గురిపెట్టడం యమా స్టైలిష్ గా ఉంది.

టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాస్ రాజా కాస్తా క్లాస్ రాజాగా మారినట్టు అనిపిస్తోంది. అందుకే డిస్కో రాజా అని టైటిల్ పెట్టారేమో మరి. సినిమాను ఇంగ్లీష్ మీడియం లో తీశారా ఏంటి అని అనుమానం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇంగ్లిష్ డోస్ కొంచెం ఎక్కువైంది. అది పక్కన పెట్టేస్తే విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. థమన్ భయ్యా నేపథ్య సంగీతం బాగుంది. ఆలస్యం ఎందుకు ఫ్రీకౌట్ అనుకుంటూ టీజర్ చూసి చిల్ అవుట్ అయిపోండి.