డిస్కోరాజా సెన్సార్ రిపోర్ట్

Mon Jan 20 2020 17:16:51 GMT+0530 (IST)

Disco Raja Censor Completed

మాస్ మహారాజా రవితేజ మొదటి సారి చేసిన సోషియో ఫాంటసీ చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాను రజినీ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు మరియు పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది.సెన్సార్ బోర్డు వారు కట్స్ ఏమీ చెప్పకుండా.. కొన్ని డైలాగ్స్ కు మ్యూట్ చెప్పి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మద్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలకు యూ/ఎ సర్టిఫికెట్ దక్కుతుంది. రవితేజ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్ మరియు కథతో రూపొందినట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా పరాజయాలతో కెరీర్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రవితేజ ఈ చిత్రంతో సక్సెస్ ను కొట్టాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలోని లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాత రవితేజను గుర్తుకు తెస్తాడని.. ఖచ్చితంగా మాస్ రాజా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

రిపబ్లిక్ డే కానుకగా రాబోతున్న ఈ చిత్రంకు సంక్రాంతి సినిమాల నుండి పోటీ ఉండక పోవడంతో పాటు మరే ఇతర సినిమా కూడా విడుదల కావడం లేదు. దాంతో సోలోగానే డిస్కో రాజా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. సినిమాకు మంచి టాక్ వస్తే భారీగానే ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.