ఓటిటిలో రచ్చ చేయనున్న 'డర్టీ హరి'!

Sun Jul 05 2020 05:00:05 GMT+0530 (IST)

Dirty Hari Movie Trending On OTT

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దాదాపు 8యేళ్ళ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకొని ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఆ సినిమానే "డర్టీ హరి". ఇదివరకే దర్శకుడిగా వాన.. తూనీగ తూనీగ సినిమాలను రూపొందించి నిరాశపరిచాడు. ఆయన డైరెక్ట్ చేసిన ఆ రెండు సినిమాలకు ఫీల్ గుడ్ సినిమాలని పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. దీంతో కొన్నేళ్లుగా దర్శకనిర్మాణ రంగాలకు దూరంగా ఉన్న ఎంఎస్ రాజు భారీ గ్యాప్ తీసుకొని న్యూ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. గతంలో నిర్మాతగా.. దర్శకుడిగా అందమైన ప్రేమకథలను తెరకెక్కించి ఇప్పుడు ట్రెండ్ మార్చి.. ప్రస్తుతం జనరేషన్ పై ఆలోచించి ఓ బోల్డ్.. కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసాడు. 'డర్టీ హరి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. బాత్ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్న హీరోకు ఓ అమ్మాయి తన కాళ్లతో సిగరెట్ అందిస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక ఆ పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు రాజు. ఇందులో ఎన్నో ఘాటు సన్నివేశాలు ఉన్నాయట. అయితే ప్రస్తుతం కరోనా టైం నడుస్తున్నందున థియేటర్లు తెరుచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. అయితే పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు నిర్మాతలు ఓటిటి ప్లాట్ ఫామ్ ల వైపు దృష్టి పెడుతున్నారు.

అయితే ఎంస్ రాజు రూపొందించిన ఈ డర్టీ హరి సినిమా కూడా ఓటిటిలో రానుందని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుందని సమాచారం. అయితే ఎప్పుడు.. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఎరోటిక్ జోనర్ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు. చూడాలి మరి విడుదల తేది ఎప్పుడు ప్రకటిస్తారో.. ఫ్యాన్స్ అయితే కాస్త కుతూహలంగానే ఉన్నారు. మరో విషయం ఏంటంటే సిమ్రత్ కౌర్ బోల్డ్ అందాల పోస్టర్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.