Begin typing your search above and press return to search.

స్టార్స్ మెప్పించే మల్టీస్టారర్ కథలు రాయాలి..?

By:  Tupaki Desk   |   30 May 2023 5:00 AM GMT
స్టార్స్ మెప్పించే మల్టీస్టారర్ కథలు రాయాలి..?
X
స్టార్ హీరో సినిమా అంటే సోలో గా రికార్డులు కొట్టేస్తుంది. ఫ్యాన్స్ ని మెప్పించే స్టార్ సినిమా వస్తే చాలు వసూళ్ల సునామీనే సృష్టిస్తుంది. అయితే ఈ మధ్య స్టార్స్ కూడా మల్టీస్టారర్ సినిమాలకు రెడీ అనేస్తున్నారు.

ఏదో పైకి అలా చెబుతారు కానీ స్టార్ హీరోలు మల్టీస్టారర్స్ కు అంతగా ఆసక్తి చూపరని ఓ టాక్ ఉంది. కానీ అందులో వాస్తవం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని స్టార్స్ అసలు ఆలోచించరు. ఇద్దరు కలిసి నటించి ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమా ఇవ్వాలని అనుకుంటారు.

అయితే స్టార్ హీరోలు మల్టీస్టారర్ కు ఓకే అంటున్నా వారిని మెప్పించే కథలు రాయడంలో దర్శకులు ఫెయిల్ అవుతున్నారు. కచ్చితమా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో వర్క్ అవుట్ చేస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అనేస్తాడు.

ఇక్కడ మ్యాజిక్ అంతా కథ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది. వెంకటేష్, మహేష్ లు ఆ సినిమాలో బ్రదర్స్ గా అదరగొట్టారు. శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాలో ఇద్దరు స్టార్స్ అన్నట్టు కాకుండా వారిని ఒక కామన్ పీపుల్ లా చూపించి సూపర్ హిట్ కొట్టారు.

ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు సమ ఉజ్జీలు అనిపించారు. ఈ ఇద్దరిని రాజమౌళి కాబట్టే అంత బాగా హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమా అంటే మా హీరోకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది అంటూ ఫ్యాన్స్ మధ్య ఫైట్ గొడవ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీటన్నిటినీ దాటి స్టార్స్ మల్టీస్టారర్స్ చేయాల్సి ఉంటుంది. దానికి మొదటి మెట్టు వారిని మెప్పించేలా కథ వారి దగ్గరకు తీసుకు వెళ్లడమే.

ఒకప్పుడు ఎన్.టి.ఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంతగా రావట్లేదని చెప్పొచ్చు.

కానీ అసలు స్టార్స్ ఓకే చెప్పే కథలు దొరక్కే మల్టీస్టారర్స్ చేయట్లేదు తప్ప ఈ విషయంలో స్టార్ హీరోలని అనడానికి ఏమి లేదని తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.