Begin typing your search above and press return to search.

దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న స్టార్ హీరోయిన్..!
X
సినిమా అనేది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనికి వెనుక ఎందరి కష్టమో ఉంటుంది.. దీనిపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ సమిష్టిగా పని చేస్తేనే.. దానికి తగ్గ అవుట్ ఫుట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ షూటింగ్స్ కు కోపరేట్ చేయకుండా దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్న ఓ అందాల భామ.. హోమ్లీ గర్ల్ ఇమేజ్‌ ని సొంతం చేసుకుంది. అందంతో పాటుగా అభినయం కూడా ఉండటంతో మంచి అవకాశాలు ఆమె వద్దకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడికి ఒక పీరియాడికల్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ వచ్చింది.

పీరియాడికల్ ఫిల్మ్ అంటే మిగతా సినిమాలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. అప్పటి కాలాన్ని ఆవిష్కరించడానికి భారీ సెట్లు.. భారీ తారాగణం.. దీనికి తగ్గట్టుగా అధిక బడ్జెట్ ఖర్చు అవుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇలాంటి సినిమాలు సకాలంలో పూర్తవుతాయి.

కానీ ఆ హీరోయిన్ షూటింగ్‌ లకు హాజరుకాకుండా నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సెట్స్‌ కి చాలా ఆలస్యంగా రావడం.. తరచుగా ఏదొక చిన్న కారణం చెప్పి షూటింగ్ కు ఎగ్గొట్టడం వంటివి చేస్తుంది. దీని వల్ల మిగతా నటీనటుల డేట్స్ సమస్యలు వస్తున్నాయి.

పీరియాడికల్ సినిమా కావడంతో షూటింగ్ క్యాన్సిల్ అవడం లేదా ఆలస్యమవడం వల్ల నిర్మాతలు ప్రతిరోజూ పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఇదంతా కేవలం ఆ హీరోయిన్ యొక్క వైఖరి వల్లనే జరుగుతోందని తెలుస్తోంది. హీరో సైతం ఆమె అనైతికతతో విసిగిపోయారు.

ఇదే కాకుండా ఆ హీరోయిన్ నటిస్తున్న మరో పెద్ద చిత్రం కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆమె ఆలస్యంగా సెట్స్‌ కి వస్తోండటంతో సినిమా లేట్ అవుతోంది. దీంతో ఆ మేకర్స్ సదరు యాక్ట్రెస్ వల్ల ఇబ్బందులు తప్పవని ఇతర నిర్మాతలను ముందుగానే హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు తెలుగులో ఆమెకు భవిష్యత్ లో ఎలాంటి ఆఫర్లు ఇవ్వకుండా నిర్మాతలు సాఫ్ట్ బ్లాక్ చేయాలని భావిస్తున్నారని ఇన్‌ సైడ్ టాక్. ఇప్పటికైనా ఆ హీరోయిన్ పరిస్థితిని అర్థం చేసుకొని మెలగకపోతే టాలీవుడ్ లో కొనసాగడం కష్టమే అనే కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.