Begin typing your search above and press return to search.
రాజమౌళికి సుకుమార్ ని మించి మరెవ్వరు ఇంత గౌరవం ఇవ్వరేమో!
By: Tupaki Desk | 25 Jan 2023 6:19 PMటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో చోటు సంపాదించుకున్న నేపథ్యంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ సుకుమార్ మాత్రం తన మాస్టర్ మైండ్ ను మరోసారి చాటుకున్నాడు.
ఇండియాలోనే అత్యంత గొప్ప ఫిల్మ్ మేకర్ గా రాజమౌళి ఘన కీర్తి సొంతం చేసుకున్న నేపథ్యంలో సుకుమార్ కూడా రాజమౌళికి గొప్ప ఘనత కట్టబెట్టాడు. ఈ ఫొటోను షేర్ చేసిన దర్శకుడు సుకుమార్.. తాను ఎప్పుడు కూడా తన టీమ్ తో స్క్రిప్ట్ చర్చ జరుపుతున్న సమయంలో ప్రిన్సిపాల్ కుర్చీని ఖాళీగానే వదిలేస్తూ ఉంటామని పేర్కొన్నాడు.
అది ఎందుకు అనేది ఇప్పుడు అందరికీ ఆయన తెలియజేశారు. ఆ కుర్చీకి అర్హులు రాజమౌళి గారు.. ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ ప్రిన్సిపాల్ కుర్చీ మీకు మాత్రమే చెందుతుంది అంటూ సుకుమార్ పేర్కొన్నాడు. పాన్ ఇండియా దర్శకుడిగా సుకుమార్ కు గొప్ప గౌరవం పుష్ప సినిమా తో దక్కిన విషయం తెల్సిందే.
అంత పెద్ద దర్శకుడు అయినా కూడా రాజమౌళి విషయంలో సుకుమార్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నిజంగా సుకుమార్ మనసు గొప్పది.. ఆయన గౌరవం పొందిన రాజమౌళి అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా రాజమౌళికి ఇంతకు మించిన గౌరవం లభించదేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.