ధమాకా డైరెక్టర్ కు మెగా ఆఫర్!

Sun Jan 29 2023 18:59:42 GMT+0530 (India Standard Time)

Director Trinadha Rao Nakkina

మాస్ మహారాజా రవితేజతో ఇటీవల ధమాకా అనే సినిమా డైరెక్టర్ చేసిన త్రినాధరావు నక్కిన బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలియజేసిన విషయం తెలిసిందే. వరుస ప్లాపులతో ఉన్న రవితేజ ధమాకా సినిమాతోనే మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అంతే కాకుండా ఆ సినిమాతోనే అతను కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడం కూడా విశేషం.ఇక ధమాకా డైరెక్టర్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. ఇంతకుముందు కూడా అతను సక్సెస్ లు అందుకున్నాడు. కానీ అవి పూర్తిస్థాయిలో అతని కెరీర్ రేంజ్ ను మాత్రం పెంచలేకపోయాయి. అయితే ఇప్పుడు ధమాకా సినిమాతో మాత్రం త్రినాధరావు తన రేంజ్ ను పెంచుకునే విధంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అడుగులు వేస్తున్నాడు.

ఈ క్రమంలో అతను ప్రయత్నాలు చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి అతనికి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మంచి కథ ఉంటే రెడీ చేసుకోవాలి అని ఆఫర్ ఇచ్చారట. ఇక త్రినాధరావు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మెగాస్టార్ దగ్గరికి వెళ్లి ఒప్పిస్తేనే ఈ ప్రాజెక్టు అయితే సెట్స్ పైకి వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే మరొకవైపు త్రినాధరావు గతంలో అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సక్సెస్ అందుకుంటే కనుక అతను మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రాజెక్టును డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నిర్మాత చాలా రోజులుగా మెగాస్టార్ తో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే లిస్టులో నాగచైతన్య సినిమా కూడా ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత త్రినాధరావు నక్కిన స్క్రిప్ట్ రెడీ అయితే మాత్రం అప్పుడే ఆ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంటుంది.