స్టార్ హీరోపై తేజ సంచలన కామెంట్స్

Wed Oct 16 2019 17:02:15 GMT+0530 (IST)

టాలీవుడ్ దర్శకుడు తేజ గతంలో సెన్షేషనల్ సక్సెస్ లు చాలా ఇచ్చాడు. కాని ఈమద్య కాలంలో ఈయన జోరు కాస్త తగ్గింది. సినిమాల విషయంలో జోరు తగ్గినా కూడా ఆయన మాటల్లో పదును మాత్రం తగ్గలేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఆయన తన మాటల పదును తగ్గించలేదు. ఎప్పటిలాగే ముకుసూటిగా మాట్లాడేస్తున్నాడు. స్టార్ హీరోలపై కొత్త హీరోలపై ఎప్పటికప్పుడు తన నిర్మొహమాట అభిప్రాయంను చెబుతూనే ఉన్న తేజ మరోసారి స్టార్ హీరో కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.యూనివర్శిల్ స్టార్ గా మంచి పేరు గుర్తింపు దక్కించుకున్న కమల్ హాసన్ గొప్ప నటుడిగా అంతా అంటూ ఉంటారు. కాని తేజ మాత్రం కమల్ ను ఒక సాదా సీదా నటుడంటూ తేల్చి పారేశాడు. ఒక నటుడు ఏదైనా పాత్రలో నటించినప్పుడు ఆ పాత్ర కనిపించాలే తప్ప ఆ నటుడు కనిపించవద్దు. కమల్ హాసన్ దశావతారం చిత్రంలో 10 పాత్రలు పోషించాడు. అది చాలా గొప్ప విషయం. కాని ఆ పది పాత్రల్లో కూడా కమల్ కనిపించాడు తప్ప ఆ పాత్ర తాలూకు గుర్తులు సినిమాలో కనిపించలేదు.

రోబో సినిమాలో సైంటిస్ట్ రోబో రూపంలో ఉన్న సమయంలో చిట్టి రోబో సైంటిస్ట్ ను గుర్తు పట్టిన సీన్ లో రజినీకాంత్ నటన చాలా బాగుంటుంది. ఆ సీన్ లో మనం రజినీకాంత్ ను కాకుండా ఆ పాత్రనే చూస్తాం. రజినీకాంత్ అస్సలు గుర్తుకు రాకుండా ఎక్స్ ప్రెషన్స్ తో అద్బుతంగా నటించాడు. అందుకే నాకు రజినీకాంత్ గారు అంటే అమితమైన అభిమానం అన్నాడు. గొప్ప నటులు అవ్వాలంటే సినిమా షూటింగ్ లో తన పోర్షన్ లేకున్నా కూడా షూటింగ్ స్పాట్ లో ఉండి ఇతరుల నటనను పరిశీలించాలి. తన పోర్షన్ లేదు కదా అని కార్ వ్యాన్ లో కూర్చోవద్దని తేజ సూచించాడు. చిరంజీవి.. అమితాబ్ వంటి గొప్ప స్టార్స్ తమ పోర్షన్ లేకున్నా కూడా షూటింగ్ ను దగ్గరుండి గమనిస్తూ ఉంటారని అందుకే వారు స్టార్ అయ్యారని తేజ అన్నాడు.