అదే స్టైలిష్ డైరెక్టర్ కు శాపంగా మారిందా?

Thu Jan 26 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Director Surender Reddy still not ready movie

ఇండస్ట్రీలో వున్న కొంత మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలతో రేసులో ముందు వరుసలో నిలుస్తుంటే కెరీర్ ప్రారంభించి దాదాపు రెండు దాశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి కొంత మంది రేసులో వెనకబడే వుంటున్నారు. కారణం వారికున్న లేజీ నెస్. అదే వారికి శాపంగా మారుతోందనే కామెంట్ లు కూడా తరచుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డిపై ఈ వార్తలు షికారు చేస్తున్నాయి.2005లో `అతనొక్కడే` మూవీతో దర్శకుడిగా సురేందర్ రెడ్డి కెరీర్ ప్రారంభించి పద్దెనిదేళ్లు కావస్తోంది. ఈ  పద్దెనిదేళ్ల కెరీర్ లో తను దక్కించుకున్న సక్సెస్ లు నాలుగంటే నాలుగే అతనొక్కడే కిక్ రేసు గుర్రం ధృవ (రీమేక్). స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఇన్నేళ్ల జర్నీలో కేవడం నాలుగు హిట్ లే సాధించడానికి ప్రధాన కారణం ఆయన లేజీనెస్ అని చెబుతున్నారు. ఒక్కో సినిమాని కొంత మంది దర్శకులు ఫాస్ట్ గా పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటే సురేందర్ రెడ్డి మాత్రం అనుకున్న దానికి మించి టైమ్ తీసుకుంటుంటారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నాడు కాబట్టే మిగతా డైరెక్టర్ లతో తను పోటీపడలేకపోతున్నాడని చెబుతున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి హీరో అఖిల్ అఖ్కినేనితో `ఏజెంట్` మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ విషయంలోనూ సురేందర్ రెడ్డి పాత పంథానే అనుసరిస్తూ ఇప్పటికీ చెక్కుతూనే వున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో అఖిల్ గాయపడటం.. ఆ తరువాత సురేందర్ రెడ్డి గాయపడటం వంటి కారణాలతో ఆలస్యం అవుతూ వస్తున్న ఈ మూవీ కొన్ని సీన్ ల రీ షూట్ కారణంగా కూడా ఆలస్యం అవుతూ వస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.

దీంతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకరపై భారం పెరుగుతోందని బడ్జెట్ చుక్కలని అంటుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలని అఖిల్ భారీ పట్టుదలతో వున్నాడు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం టైమ్ దాటినా ఇప్పటికీ చెక్కేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సురేందర్ రెడ్డి మారేనా? అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.