Begin typing your search above and press return to search.

సుకుమార్ డిజాస్టర్ సినిమాను స్పూర్తిగా తీసుకున్నాడట

By:  Tupaki Desk   |   27 March 2023 11:00 PM GMT
సుకుమార్ డిజాస్టర్ సినిమాను స్పూర్తిగా తీసుకున్నాడట
X
సుకుమార్ కెరియర్ ఆరంభంలో ఆర్య సినిమా తర్వాత రామ్ పోతినేని హీరోగా జగడం మూవీ చేశాడు. ఈ సినిమా వీరిద్దరి కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక రౌడీ కావాలని అనుకునే ఓ యువకుడు కథగా దీనిని సుకుమార్ ఆవిష్కరించాడు. అయితే జగడం సినిమా మేకింగ్ పరంగా చాలా మంది దర్శకులకి స్ఫూర్తినిచ్చే సినిమా అని చెప్పాలి.

పవర్ ఫుల్ మాస్ కంటెంట్ ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. రాజమౌళి సైతం జగడం సినిమాపై ప్రశంసలు కురిపించారు. సుకుమార్ మాస్ సినిమాలు చేసి ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీసే వారని అన్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ శిష్యులు చాలా మంది ఇప్పుడు దర్శకులుగా మారుతున్న సంగతి తెలిసిందే.

సుకుమార్ నిర్మాతగా మారి వాళ్ళని దర్శకులుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ టీమ్ నుంచి దసరా సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఒదేల పరిచయం అవుతున్నాడు. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ కి కూడా జగడం సినిమా స్ఫూర్తి అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

డిగ్రీ చదువుతున్న సమయంలో జగడం మూవీ చూసి డైరెక్షన్ మీద మక్కువ పెంచుకోవడం జరిగిందని తెలిపాడు. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చేసి నేరుగా సుకుమార్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఇక సుకుమార్ చుట్టూ రెండేళ్ళు తిరగడంతో ఓ షార్ట్ ఫిల్మ్ తీసుకొని రమ్మని సుకుమార్ అతనికి సూచించాడు. శ్రీకాంత్ చేసిన షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో తన టీమ్ లో చేర్చుకున్నాడు.

అలా రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాల వరకు సుకుమార్ తో కలిసి పని చేశారు. తరువాత సొంత కథ రెడీ చేసుకొని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇక అతనికి నాని అవకాశం ఇవ్వడంతో దసరా మూవీతో దర్శకుడిగా మారాడు. ఇక సుకుమార్ దగ్గర వర్క్ చేయడంతో శ్రీకాంత్ మేకింగ్ లో కూడా అతని శైలి ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా రంగస్థలం, జగడం సినిమాల చాయలు ఈ దసరా మూవీలో కనిపిస్తూ ఉంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.