రాపోని ఆశీర్వదించిన శంకర్-మణిరత్నం

Wed Jul 06 2022 22:15:28 GMT+0530 (IST)

Director Shankar Mani Ratnam on ram

ఇటీవలి కాలంలో ఇలాంటిది మరొకటి లేదు! అనేంత రేంజులో నేటి (బుధవారం) సాయంత్రం రామ్ పోతినేని `వారియర్` తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై ముందే చెప్పినట్టుగానే 20  మంది పైగా ప్రత్యేక అతిథులు కనిపించారు.ఇందులో శంకర్- మణిరత్నం- పన్నీర్ సెల్వం- ఎస్.జె.సూర్య- కార్తీక్ సుబ్బరాజు-దేవీశ్రీ సహా పలువురు తమిళ చలనచిత్ర ప్రముఖులు ఉన్నారు. ఇక వీళ్ల మధ్యలో లింగుస్వామి చెంతనే ఎనర్జిటిక్ రామ్ - కృతి శెట్టి జంట కనిపించింది.

ఇక తమిళ ఈవెంట్లో రామ్ ఎంతో ఇస్మార్ట్ గా కనిపించాడు. తాజా ఈవెంట్ రామ్ కి పాజిటివ్ వైబ్స్ ని తెచ్చిందని చెప్పాలి. వారియర్ అన్న టైటిల్ కి తగ్గట్టే ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది కాబట్టి రామ్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడనే అభిమానులు ఆశీస్తున్నారు.

ప్రస్తుతం వారియర్ ప్రీరిలీజ్ లైవ్ వేదికపై తమిళ స్టార్ డైరెక్టర్లు శంకర్ - మణిరత్నం రామ్ పోతినేనికి తమ ఆశీర్వచనాలు అందించారు. లింగుస్వామి ఈ చిత్రాన్ని ఎంతో స్పెషల్ గా తెరకెక్కించి ఉంటారని పెద్ద విజయం అందుకోవాలని ముఖ్య అతిథులు ఆశీస్సులు అందించారు.

దేవీశ్రీ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి. ఈ మూవీ జూలై 14 నుంచి థియేటర్లలో అందుబాటులో ఉండనుంది.

ఈ చిత్రం రామ్ కి తమిళ పరిశ్రమలో డెబ్యూ మూవీ కాబట్టి ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. అలాగే రామ్ తెలుగు మార్కెట్ తో పాటు తమిళ మార్కెట్లో సత్తా చాటేందుకు లింగుస్వామి లాంటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న దర్శకుడితో సినిమా చేసారు.

వారియర్ కోసం అటు తమిళ ఇండస్ట్రీ సహా ఇటు తెలుగు ఇండస్ట్రీ అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. రామ్ అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ అంతకంతకు పెరుగుతోంది. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలన్న పట్టుదల రామ్ కి ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి.