Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ మాదిరిగా 'లూసీఫర్‌' రీమేక్‌ లోనూ ఆ మార్పు

By:  Tupaki Desk   |   29 Sep 2020 6:00 AM GMT
వకీల్‌ సాబ్‌ మాదిరిగా లూసీఫర్‌ రీమేక్‌ లోనూ ఆ మార్పు
X
తెలుగు హీరోలు పక్కా కమర్షియల్‌ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కమర్షియల్‌ సినిమాలను మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతారు. హీరోకు ఖచ్చితంగా హీరోయిన్‌ ఉండాలి.. ఆమెతో రెండు మూడు పాటలు జోక్స్‌ ఫైట్స్‌ ఉండాలి. అప్పుడే తెలుగు ప్రేక్షకులు ఫుల్‌ మీల్స్‌ లా సినిమా ఉంది అంటూ ఫీల్‌ అవుతారు. అందుకే ఇతర భాషల్లో విడుదలై హిట్‌ కొట్టిన సినిమాలను సైతం తెలుగులో రీమేక్‌ చేసేప్పుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి మరీ తెరకెక్కిస్తారు. ఉదాహరణకు హిందీలో హిట్‌ అయిన పింక్‌ సినిమాలో హీరోయిన్‌ ఉండదు. తమిళంలో ఆ సినిమాను హీరోయిన్‌ లేకుండానే రీమేక్‌ చేశారు. కాని తెలుగుకు వచ్చేప్పటికి వకీల్‌ సాబ్‌ అంటూ టైటిల్‌ విభిన్నంగా పెట్టి పవన్‌ కు జోడీగా హీరోయిన్‌ ను కూడా నటింపజేస్తున్నారు. శృతి హాసన్‌ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

పింక్‌ రీమేక్‌ కు చేస్తున్నట్లుగానే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ 'లూసీఫర్‌' విషయంలోనూ అదే చేస్తున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన లూసీఫర్‌ ను తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. సుజీత్‌ కు మొదట ఈ రీమేక్‌ బాధ్యతలు అప్పగించారు. ఏవో కారణా వల్ల ఈ ప్రాజెక్ట్‌ వివి వినాయక్‌ చేతికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రచయితలు లూసీఫర్‌ ను పూర్తిగా కమర్షియల్‌ యాంగిల్‌ లో మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

లూసీఫర్‌ హీరో పాత్రకు లేడీ లీడ్‌ ఉండదు. కాని చిరంజీవికి జోడీగా లేడీ లీడ్‌ లేకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ ఈ విషయంలో నిరుత్సాహ పడే అవకాశం ఉంది. అందుకే చిరంజీవికి హీరోయిన్‌ ఉండటంతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా సాయి మాధవ్‌ బుర్రాతో పాటు పలువురు ప్రముఖ రచయితలు మరియు దర్శకుడి టీం కథ వండే పనిలో పడ్డారు. కొన్ని సినిమాలు ఉన్నది ఉన్నట్లుగా తీస్తేనే బాగుంటుంది. మరి లూసీఫర్‌ సినిమాను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి తీస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికర విషయం.