పరశురామ్.. ఈ కన్ఫ్యూజన్ ఏమిటి సార్?

Tue Feb 07 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Director Parusuram in Confusion Over Films

టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి పరశురాం. పరశురాం గీతా ఆర్ట్స్2 లో గీతాగోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన కూడా నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ళు తీసుకున్న పరశురాం గత ఏడాది సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దీని తర్వాత మరల గీతా ఆర్ట్స్ లో 2 సినిమాలు చేయడానికి పరశురాం కమిట్ అయ్యాడు. అలాగే నాగ చైతన్యతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

 అలాగే మైత్రీ మూవీ మేకర్స్ లో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలకృష్ణ అఫీషియల్ గా పరశురాంతో సినిమా చేయబోతున్న విషయాన్ని ప్రకటించాడు. అయితే వీరసింహారెడ్డి తర్వాత ఆ సినిమా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఉన్నపళంగా పరశురాం దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండతో గీతాగోవిందం 2 చేయడానికి ఒకే చెప్పాడు.

అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు దిల్ రాజు ప్రకటించాడు. అయితీ ఈ సినిమాని పరశురాం గీతా ఆర్ట్స్ లో చేయాల్సి ఉంది. ఇక దీనికోసం నిర్మాత అల్లు అరవింద్ అతనికి రెమ్యునరేషన్  కూడా భారీగానే ఇచ్చారని తెలుస్తుంది.

అయితే దిల్ రాజు విజయ్ తో ఏకంగా వంద కోట్ల ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దానికి సరైన దర్శకుడు పరశురాం అని భావించి అతనికి ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేయడంతో దిల్ రాజుకి ముందుగా మూవీ చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అల్లు అరవింద్ పరశురాంపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయాలని భావించినట్లు తెలుస్తుంది.

అయితే ఎందుకనో మరల వెనక్కి తగ్గినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే గీతా గోవిందం సీక్వెల్ అఫీషియల్ గా ప్రకటించిన కూడా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో పరశురాం విజయ్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఈ లోపు బాలకృష్ణతో సినిమాని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.