Begin typing your search above and press return to search.

ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన దర్శకులు ఎవరంటే?

By:  Tupaki Desk   |   8 Feb 2023 8:00 AM GMT
ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన దర్శకులు ఎవరంటే?
X
ఇండియన్ సినిమా స్టాండర్డ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. యూనివర్సల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న మన సినిమాలు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా సత్తా చాటుతున్నాయి. ఇక ఇండియన్ వైడ్ గా కూడా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకి చేరువ అవుతున్నాయి. దీనికి కారణం ఆయా సినిమాలలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్ అని చెప్పాలి. ప్రేక్షకులు కనెక్ట్ కావాలంటే ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్న కూడా అందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి.

ప్రేక్షకులని కన్విన్స్ చేసే ఎమోషన్ ఎప్పుడైతే సినిమా కథలో ఉంటుందో అలాంటి కథలు కచ్చితంగా అన్ని భాషల ప్రేక్షకులకి కూడా ఆకట్టుకుంటాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం దర్శకులు అర్ధం చేసుకోవడంతో కచ్చితంగా తమ కథలలో ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులని దర్శులు రంజింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నడూ లేని విధంగా మన ఇండియన్ సినిమాలు కూడా వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటున్నాయి.

ఇక చాలా మంది ఆ దిశగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన టాప్ దర్శకులని చూసుకుంటే ముందుగా వినిపించే పేరు నితేష్ తివారి. దంగల్ సినిమాతో ఈ దర్శకుడు ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రాన్ని అందించాడు. ఇక తరువాత స్థానంలో 1500 కోట్ల క్లబ్ లో రాజమౌళి ఉన్నాడు. బాహుబలి 2 మూవీ ఈ కలెక్షన్స్ ని బీట్ చేసింది.

ఇక వెయ్యి నుంచి 1500 కోట్ల మధ్య కలెక్షన్స్ సాధించిన దర్శకుల జాబితాలో కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్, అలాగే ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి మరోసారి స్థాయి టాప్ చైర్ లో ఉన్నాడు. ఇక షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ కూడా త్వరలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ బీట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ కూడా వెయ్యి కోట్ల దర్శకుల జాబితాలోకి వచ్చే అవకాశం ఉందనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మళ్ళీ ప్రశాంత్ నీల్ సలార్ తో ఈ వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటాడు అని భావిస్తున్నారు. అలాగే శంకర్ పేరు కూడా వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.