సన్నాఫ్ దానయ్య డెబ్యూ.. మారుతి ఫిక్స్

Sun Dec 08 2019 12:36:12 GMT+0530 (IST)

Director Maruti to Launch DVV Danayya Son

కామెడీ ఎంటర్టైనర్లను మలచడంలో ప్రత్యేకత చూపించే దర్శకుడు మారుతి ప్రస్తుతం 'ప్రతిరోజూ పండగే' సినిమాతో బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో సాయి తేజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.  'ప్రతిరోజూ పండగే' ప్రోమోస్ ఆసక్తికరంగా ఉండడంతో మారుతి ఈ సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు.ఇదిలా ఉంటే మారుతి దర్శకత్వం వహించబోయే నెక్స్ట్ సినిమా ఇప్పటికే ఖరారయిందని సమాచారం. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య త్వరలో తన కుమారుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు.  దానయ్యగారు తమ అబ్బాయిని లాంచ్ చేసే బాధ్యతను  మారుతికి అప్పగించారట.  ఈ సినిమాకు 6 కోట్ల రూపాయల భారీ పారితోషికం మారుతికి ఆఫర్ చేశారట దానయ్య.  మారుతి కెరీర్ లో ఇదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు.

దర్శకుడు మారుతి కెరీర్లో మంచి హిట్లే ఉన్నాయి.  స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యలేదు కానీ కొత్తవారితో.. మీడియం రేంజ్ హీరోలతో ప్రేక్షకులను మెప్పించే సినిమాలు రూపొందించడంలో మారుతికి మంచి పేరు ఉంది.  మరి సన్నాఫ్ దానయ్యను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిస్తారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల గురించి తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.