Begin typing your search above and press return to search.

మారుతి చేతికి ప్రభాస్ లగ్జరీ కార్

By:  Tupaki Desk   |   29 Jan 2023 4:15 PM GMT
మారుతి చేతికి ప్రభాస్ లగ్జరీ కార్
X
తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ హిట్టు కొట్టడం, నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టడంలో దర్శకుడు మారుతికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన తెరకెక్కించిన బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు చిన్న బడ్జెట్ తో వచ్చి పెద్ద సక్సెస్ అయ్యాయి. చేసింది తక్కువ సినిమాలే అయిన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫేమ్‌ని సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్ని అలరించేలా అన్ని జోనర్లలోనూ సినిమాలు తీసి చూపించారు. త్వరలో అగ్రకథానాయకులతో సైతం సినిమాలు చేయనున్నారు.

రీసెంట్ గా గోపిచంద్‌, రాశీఖన్నా తో పక్కా కమర్షియల్ చేసి డీసెంట్ హిట్ ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఆయన ఓ లగ్జరీ కారులో స్టైలిష్ గా కూర్చొని పోజ్ ఇచ్చారు. అది మరెవరిదో కాదు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన లంబోర్గిని. అందులోనే మారుతి కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆ ఫోటోలకు తెగ లైట్స్ కామెంట్స్ పెడుతున్నారు. అదిరిపోయింది సూపర్ అంటూ ఆ ఫొటోస్ ను ట్రెండ్ చేస్తున్నారు. అలానే ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వమని కోరుతున్నారు.

ఇక మారుతి ప్రభాస్ సినిమా విషయానికొస్తే.. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఆయనకు తాతగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కనిపించనున్నట్లు సమాచారం. రాజాడీలక్స్‌ అనే ప్రచార టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ఓ ఇంటి సెట్లో ప్రభాస్‌, ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తోపాటు రిద్దికుమార్‌ మరో కథానాయిక. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్‌ మరో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. వాటిలో ఆదిపురుష్‌ నిర్మాణానంతర పనుల్లో ఉండగా, సలార్‌, ప్రాజెక్ట్‌ కె చిత్రీకరణ దశలో ఉన్నాయి.

ఇక పోతే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు కార్ల మోజు ఉన్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా అది తమ గారేజ్ లో ఉండేలా చూసుకుంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకరు. ఈయనకు కూడా కార్ల పిచ్చి చాలానే ఉంది. ముఖ్యంగా ఏ కొత్త కారు వచ్చినా కూడా వెంటనే కొనేస్తుంటారు. పైగా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కూడా. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియాలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈయన సినిమాకు100 కోట్ల పారితోషికం తీసుకుంటారని ప్రచారం ఉంది.