నేను డైరెక్టర్ ని కాదు కేవలం మీడియేటర్ ని

Tue Jun 28 2022 12:09:30 GMT+0530 (IST)

Director Maruthi comments on PakkaCommercial movie interview

తనదైన మార్కు కుటుంబ భావోద్వేగాల్ని జోడించి కమర్షియల్ ఎంటర్ టైనర్ లని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ `పక్కా కమర్షయల్`. గోపీచంద్ హీరోగా నటించారు. రాశిఖన్నా హీరోయిన్.గీతా ఆర్ట్స్ 2 యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన కమర్షియిల్ ఎంటర్ టైనర్ ఇది. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దర్శకుడు మారుతి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి ప్రభాస్ చిరంజీవిలతో చేయబోయే ప్రాజెక్ట్ లపై పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. వారిని తన సినిమాల్లో ఎలా చూపించబోతున్నాడో వివరించాడు. ఫ్యాన్స్ దృష్టి కోణం నుంచి హీరోలని వాళ్లు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో తెలుసుకుని అదే పంథాలో వారిని ఆవిష్కరిస్తుంటానని చెప్పుకొచ్చారు. చిరంజీవి అయినా ప్రభాస్ అయినా ఆడియన్స్ కోరుకున్న పంథాలోనే వారిని ఆవిష్కరించాలనుకుంటానని తెలిపారు.  

అంతే కాకుండా ప్రేక్షకులు ఎలా హీరోలని చూడాలని ముచ్చటపడుతున్నారో.. ఎలాంటి పాత్రల్లో చూపిస్తే వారికి నచ్చుతుందో ... ఆ విషయాల్ని హీరోలకు స్పష్టంగా వివరిస్తాను. వారి ఫీలింగ్స్ కి దగ్గరగా హీరోల పాత్రలు వుండేలా తీర్చిదిద్దుతుంటాను. ఈ విషయంలో నేను డైరెక్టర్ గా కాకుండా హీరోలకు ప్రేక్షకులకు మధ్య వుండే మీడియేటర్ లా వ్యవహరిస్తానన్నారు. ఇదే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్ తోనూ తాను సినిమాలు చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చారు.

ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని `పక్కా కమర్షయిల్` రిలీజ్ అయిన మూడు వారాల తరువాత వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఇక న్రభాస్ తో చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని ప్రభాస్ మార్కు యాక్షన్ అంశాలకు తన మార్కు కామెడీ అంశాలని జోడించి చేయబోతున్నాడట మారుతి.

దిలా వుంటే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఈ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్ లని చూసి అదృష్టం అంటే ఇలానే వుంటుందేమో! అని కామెంట్ లు చేస్తున్నారట. ఒకే సారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డీవీవీ దానయ్య సినిమా.. అలాగే ఎదురుచూడని మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆఫర్ రావడం.. దాన్ని ఉవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తామని చెప్పడంతో అద్ఋష్టం అంటే మారుతిదే అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ లు చేస్తున్నారట.