స్టార్ డైరెక్టర్ ని కట్టడి చేస్తున్న బిగ్ ఫిల్మ్స్

Sat Jan 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Director Koratala Siva Acharya

ముందు కు వెళితే నుయ్యి వెనక్కి వెళితే గోయ్యి అన్నట్టుగా మారింది ఓ స్టార్ డైరెక్టర్ పరిస్థితి. కరోనా కారణంగా తను అంగీకరించిన భారీ చిత్రం ఆలస్యం అవుతూ వుండటంతో సదరు డైరెక్టర్ ముందుకు వెళ్లలేక వెనక్కి తగ్గలేక సతమతమవుతున్నారట. ప్రస్తుం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది. భారీ హంగులతో అత్యంత భారీ బడ్జెట్ తో కొరటాల శివ `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆల్ మోస్ట్ మూవీ కంప్లీట్.రామ్ చరణ్ ఇందులో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర కోసం కొన్ని రోజులు ఆలస్యం అయింది. ఆ తరువాత చరణ్ ఫైనల్ చేసిన తరువాత కూడా `ఆర్ ఆర్ ఆర్` కారణంగా అతనికి సంబంధించిన చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. జక్కన్న ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అప్పుడే చరణ్ `ఆచార్య` చిత్రీకరణకు డేట్స్ కేటాయించి చిత్రీకరణలో పాల్గొన్నాడు.  

ఇక షూటింగ్ మొదలైంది సాఫీగా సాగుతోంది అనుకున్న తరుణంలో మెగాస్టార్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో మరి కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్ అంకానికి `ఆచార్య` చేరింది. ఇక రిలీజ్నుకున్న సమయంలో థర్డ్ వేవ్ ప్రకంపణలు మొదలయ్యాయి. దీంతో చాలా రోజులుగా `ఆచార్య`కే పరిమితమైపోయిన కొరటలా శివ ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు కూడా. నందమూరి కల్యాణ్ రామ్ మిక్కినేని సుధాకర్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో ఆచార్య ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ఆయనని కట్టడి చేస్తున్నాయి. ఇవి రిలీజ్ అయితే గానీ కొరటాల ఎన్టీఆర్ చిత్రాన్ని పట్టాలెక్కించలేని పరిస్థితి. దీంతో అడకత్తెరలో పోక చెక్క తరహాలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఏదీ డిసైడ్ చేసుకోలేక డైలమాలో వున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.