Begin typing your search above and press return to search.

'ఉపాసన అలా చెప్పడం నాకు నచ్చలేదు'.. సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   7 July 2022 3:30 AM GMT
ఉపాసన అలా చెప్పడం నాకు నచ్చలేదు.. సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు గత పదేళ్లుగా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరికి వివాహమై దశాబ్దం గడిచిపోవడంతో, తరుచుగా పిల్లలకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇదే విషయాన్ని మెగా కోడలు ఇటీవల సద్గురు జగ్గీ వాసుదేవ్ దగ్గర ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఉపాసన మాట్లాడుతూ.. "మాకు పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబాన్ని నా లైఫ్ ను నేనెంతో ప్రేమిస్తున్నాను. కానీ కొంతమంది అదే పనిగా నా RRR (రిలేషన్ షిప్ - రీప్రొడ్యూస్ - రోల్ ఇన్ మై లైఫ్) గురించి ప్రశ్నిస్తుంటారు.. ఎందుకు? ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది" అని సద్గురు ని సమాధానం కోరింది.

అయితే ఉపాసన తన వ్యక్తిగత విషయాన్ని పబ్లిక్ వేదిక మీద ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాపులేషన్ ను కంట్రోల్ చేయడానికి సద్గురు కి రామ్ చరణ్ - ఉపాసన దంపతులే దొరికారా? అని ప్రశ్నించారు.

గీతా కృష్ణ మాట్లాడుతూ.. ''వంశవృక్షం వంశాంకురాన్ని కోరుకోవడంలో తప్పులేదు. పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత పిల్లలను ప్లాన్ చేసుకోవడం అనేది మోడరన్ జెనెరేషన్ కాన్సెప్ట్. దీని కోసం మెడికేషన్ తీసుకుంటుంటారు. ఇదంతా ఉపాసన వ్యక్తిగత విషయం కాబట్టి మనం కలుగజేసుకోకూడదు. అయితే ఆమె అడిగిన దానికి, పాపులేషన్ పెరగకుండా ఉండటానికి అదొక మంచి పాయింట్ అని జగ్గీ వాసుదేవ్ చెప్పడం అనేది ఒక మెట్ట సిద్ధాంతం. అది వీళ్ళకే (రామ్ చరణ్-ఉపాసన) వర్తింపచేయాలా?. వీళ్ళ మీదనే ప్రయోగించాలా?. అతను(సద్గురు) నాన్సెన్సియల్ ఫెలో. ఎవడండీ వాడు?. అతను చెప్పిన దాన్ని నేను ఖండిస్తున్నాను'' అని అన్నారు.

''పూరి గుడిసెలో ఉన్న ఫ్యామిలీ నుంచి పెద్ద కుటుంబాల వరకూ అందరూ పిల్లల్ని కోరుకుంటారు. చిరంజీవి కుటుంబమైనా ఎవరైనా పెళ్ళైన తమ కొడుకూ కొడళ్లను పిల్లల గురించి అడుగుతారు. అది వాళ్ళ ఆతృత. అందరం మనుషులమే కాబట్టి చిరంజీవి మరియు ఆయన సతీమణి కూడా అలానే అడుగుతారు. అయితే ఉపాసన ఈ విషయాన్ని వారితో చెప్పలేక.. వీడు సద్గురు ఒక మహానుభావుడు అనుకొని ఆ వేదిక మీద చెప్పిందని నేను అనుకుంటున్నాను. కానీ అది నాకు నచ్చలేదు'' అని గీత కృష్ణ అన్నారు.

''చిరంజీవి - రామ్ చరణ్ స్టార్స్ కాబట్టి.. వారి మీదున్న ఇష్టంతో అందరూ వాళ్ళని పబ్లిక్ ప్రాపర్టీగా భావిస్తారు. అందుకే ఫ్యాన్స్ కూడా పిల్లల గురించి అడిగుండొచ్చు. మా ఇంట్లో కూడా ఇలాంటి భావనే ఉందని ఆమె పరోక్షంగా చెప్పి ఉండొచ్చు. కానీ ఒక డయాస్ మీద చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అది ఆమె వ్యక్తిగత విషయం. భర్త మరియు అత్త మామలతో చర్చిస్తే సరిపోతుంది. ఆ అమ్మాయి మామూలుగా చెప్పి ఉండొచ్చు. కానీ నాకు అది నచ్చలేదు'' అని అన్నారు.

జగ్గీ వాస్ దేవ్ పిల్లల్ని కనకపోతే బహుమతి ఇస్తానని చెప్తున్నాడు. ఇదంతా నాన్ సెన్స్. వంశాంకురాన్ని కోరుకోవడం తప్పా? అదే సమయంలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు అని ప్రజలు శ్రేయోభిలాషులు అడగడం కూడా తప్పే. కాకపోతే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. ఉపాసనను కూడా తమ కూతురిగానో కోడలిగానో సిస్టర్ గానో ప్రేమిస్తారు. అందులోనూ ఆమె అపోలో హాస్పిటల్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి కచ్చితంగా పిల్లల గురించి అడుగుతారు.

కానీ ఆ విషయాన్ని పబ్లిక్ గా ఆయన దగ్గర అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నా పెద్ద సంసారినా? సమంత లాంటి వాళ్ళు అందరూ వెళ్లి జగ్గీ వాసుదేవ్ ఒక ఇన్ఫ్లూఎన్సర్ లాగా ఫేమస్ చేస్తున్నారు. అసలు ఉపాసన ఆయన దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది అని గీతా కృష్ణ చెప్పుకొచ్చారు.

ప్రపంచంలో ఎవరు లేనట్టు మీరే పాపులేషన్‌ ను కంట్రోల్ చేయాలా.. అంటూ ఉపాసన తీరుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. మెగా ఫ్యామిలీ సహా అడుక్కువాడైన తమ ఇంట్లో ఓ వారసుడు రావాలని కోరుకుంటారు. అలాంటిది వేల కోట్లకు అధిపతి అయిన మెగా ఫ్యామిలీ కోడలు పాపులేషన్ పెరగకూడదనే ఉద్దేశ్యంతోనే పిల్లలను వద్దనుకోవడం ఇపుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇకపోతే ఉపాసన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. రిలేషన్ ఫిష్ అనేది వ్యక్తిగత అంశం కాబట్టి దాని గురించి నేనేం చెప్పలేను అని సద్గురు అన్నారు. రీప్రొడక్షన్ విషయానికొస్తే, పిల్లలు కనకుండా ఉంటే నేను అవార్డు ఇస్తా. ఆరోగ్యం, సంతాన సామర్ధ్యం ఉన్నా పిల్లలు కనకూడదని నిర్ణయించుకున్న వారికి అవార్డు ఇస్తానని నేనిప్పటికే ప్రకటించాను. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు కనకపోవడమే గొప్ప సేవ చేసినట్టు అని చెప్పారు.

''ఒకవేళ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడ్ని. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతోంది కాబట్టి. ఇదేమీ అంతరించిపోయే జంతుజాలం గురించి చెప్పే ఉపన్యాసం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అద్భుతమే. రాబోయే 30-35 సంవత్సరాల్లో ప్రపంచం జనాభా 10 బిలియన్లకు చేరువయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉండటానికి కూడా చోటు సరిపోదు. పర్యావరణ విపత్తు సంభవించవచ్చు. మనసు పెట్టి ఆలోచిస్తే జనాభా తగ్గించటం అనేది సాధ్యపడుతుంది''

''మెదడుకు పని చెప్పకపోతే జననేంద్రియాలు మరింత యాక్టివ్ గా పనిచేస్తాయి. దీని వల్ల ఈ ప్రపంచంలోకి మరింత మంది మనుషుల అడుగులు పడతాయి. ఒకానొక దశ దాటిని తర్వాత మనం కాలు కూడా కదలలేని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే రెండో ఆప్షన్ గా అవార్డులు ప్రదానం చేయడమే'' అని సద్గురు వివరించారు. దీనికి ఉపాసన స్పందిస్తూ.. త్వరలోనే మా అమ్మ అత్తయ్య నుంచి మీకు కాల్ వస్తుందని నవ్వుతూ చెప్పింది. ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.