Begin typing your search above and press return to search.
మరో మెగా హీరోతో జతకట్టనున్న డైరెక్టర్ బాబీ..!
By: Tupaki Desk | 6 Feb 2023 7:00 PMమెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలైన మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ అద్భుత విజయానికి మెగా అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చిరును అదిరిపోయే మాస్ పర్ఫార్మెన్స్ లో చూపించినందుకు తెగ సంతోష పడిపోతున్నారు.
అలాగే సమపాళ్లలో కామెడీ కూడా అందించడంతో పాత చిరు కనిపించాడని.. యంగ్ గా ఉన్నప్పుడు ఎలా అనిపించిందో.. ఇప్పుడు కూడా అలాగే అనిపించిందంటూ దర్శకుడు బాబీపై ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.
అయితే మెగాస్టార్ చిరుకు డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు త్వరలోనే మరో మెగా హీరోతో రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల మీడియాతో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో మెగా హీరోతో కలిసి పని చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని బాబీ తెలిపారు.
బాబీ చేసిన ఈ ప్రకటన మెగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అప్పటి నుంచి బాబీ ఎవర్ని డైరెక్ట్ చేయబోతున్నారు, ఎలాంటి కథతో రాబోతున్నారని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
అలాగే బాబీ సినిమా చేయబోయేది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కూడా ఓ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తేజ్ విరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
అయితే బాబీ చేయబోయేది సాయి ధరమ్ తేజ్ తోనేనా లేక మరవరైనా మెగా హీరోతోనా అనే క్లారిటీ అయితే ఇంకా లేదు. కానీ ఇటీవలే చిరుతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో రాబోయే సినిమా అంతకు మించి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు మెగా అభిమానులు. గతంలో డైరెక్టర్ బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.